‘సవ్యసాచి’ ఏపీ, తెలంగాణ కలెక్షన్స్ ఏరియా వైజ్
నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యసాచి' ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీసు వద్ద నిరాశాజనకమైన ఫలితాలు నమోదు చేసింది. ఆదివారంతో 3 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ వసూళ్లు రాబట్టింది.
మరో వైపు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవని అంటున్నారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచి మిక్డ్స్ టాక్ సొంతం చేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాన్సెప్టు కొత్తగా ఉన్నా ఆకట్టుకునే విధంగా సినిమాను మలచడంలో దర్శకుడు విఫలం అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి 3 రోజుల్లో రూ. 6.30 కోట్ల షేర్ వసూలు చేసింది. కాస్త బడ్జెట్ ఎక్కువగానే ఖర్చు పెట్టిన ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ ఇంత తక్కువ షేర్ రావడం అందరినీ డిసప్పాయింట్ చేసింది.

ఏరియా వైజ్ షేర్ వివరాలు పరిశీలిస్తే... నైజాం రూ. 2.16 కోట్లు, సీడెడ్ రూ. 1.10 కోట్లు, నెల్లూరు రూ. 28 లక్షలు, గుంటూరు రూ 70 లక్షలు, కృష్ణ రూ. 47 లక్షలు, వెస్ట్ రూ. 33 లక్షలు, ఈస్ట్ రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 92 లక్షలు... రాబట్టింది.
'సవ్యసాచి' చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది. ప్రమోషన్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. నాగ చైతన్య గత చిత్రాలన్నింటికంటే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. అత్యధిక స్క్రీన్లలో విడుదల చేశారు. అయినా అవేవీ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











