Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సవ్యసాచి’ కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉంది?
Recommended Video
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యాసాచి' చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. సక్సెస్ఫుల్ చిత్రాలు అందించిన మైత్రి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడం, మాధవన్ ఇందులో విలన్ రోల్ పోషించడం, రషెస్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడాయి.
యూఎస్ఏ బాక్సాఫీసు రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఓపెనింగ్స్ పరంగా నాగ చైతన్య గత చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' కంటే 'సవ్యసాచి' వెనకపడ్డట్లు తెలుస్తోంది. అయితే గతంలో చైతు-చందూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' రికార్డులను ఈ చిత్రం అధిగమించింది.
ప్రీమియర్ షో వసూళ్ల వివరాలు
‘సవ్యసాచి' యూఎస్ఏ వసూళ్ల వివరాలు పరిశీలిస్తే... ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 91 లొకేషన్ల నుంచి $87,257 వసూలు చేసినట్లు తెలుస్తోంది. చైతు గత చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు' ప్రీమియర్ షోల ద్వారా $107,448 వసూలు చేసింది.
ప్రేమమ్ రికార్డ్స్ బద్దలు
అయితే చైతు-చందు కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్' ప్రిమయర్ షో ($74,219)రికార్డులను ‘సవ్యసాచి' అధిగమించింది. అయితే సవ్యసాచి ప్రీమియర్ షోల ద్వారా కనీసం లక్ష డాలర్ల మార్కును అందుకోక పోవడం డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
యూఎస్ఏ రైట్స్ ఎంతకు అమ్మారు?
‘సవ్యసాచి' యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టెనర్స్ వారు తీసుకున్నారు. రూ. 3.50 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. యూఎస్ఏ వ్యాప్తంగా 135 లొకేషన్లలో ఈ సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
‘సవ్యసాచి' చిత్రంపై మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది. సినిమా కథ కొత్తగా ఉందని, తెలుగులో ఇలాంటి కాన్సెప్టు సినిమాలు అరుదుగా వస్తుంటాయని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం సినిమా ఆకట్టుకోలేదని అంటున్నారు. ఫస్ట్ వీకెండ్ గడిస్తే తప్ప రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టమే.