Seetha Payanam Closing Collections: సీతా పయనం క్లోజింగ్ కలెక్షన్లు... అర్జున్ సర్జా మూవీకి లాభమా? నష్టమా?

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శక నిర్మాణంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన చిత్రం సీతా పయనం. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న సీతా పయనం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీతా పయనంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఫ్యామిలీకి చెందిన నిరంజన్ హీరోగా నటించారు. అర్జున్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో నటించారు.

శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా నిర్మించారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించగా.. జీ బాల మురుగన్ సినిమాటోగ్రఫి, అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో సీతా పయనం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? సీతా పయనం మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాలు పరిశీలిస్తే..

Seetha Payanam Box Office Collections Worldwide Arjun Sarja s film Closing Collections at Global Box Office Report

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సీతాపయనం సినిమాకు 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 500కు పైగా స్క్రీన్‌లలో విడుదల చేశారు.

సీతా పయనం కలెక్షన్స్
సీతా పయనం మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 16 లక్షల రూపాయలు, రెండో రోజు 18 లక్షల రూపాయలు, మూడో రోజు 12 లక్షల రూపాయలు, నాలుగో రోజున 10 లక్షల రూపాయలు, ఐదో రోజున 10 లక్షల రూపాయలు, ఆరో రోజున 5 లక్షల రూపాయలు, ఏడో రోజున 3 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే కన్నడంలో తొలిరోజు 11 లక్షల రూపాయలు, రెండో రోజున 9 లక్షల రూపాయలు, మూడో రోజున 6 లక్షల రూపాయలు, నాలుగో రోజున 6 లక్షల రూపాయలు, ఐదో రోజున 2 లక్షల రూపాయలు, ఆరో రోజున 2 లక్షల రూపాయలు, ఏడో రోజున 4 లక్షల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ఇప్పటి వరకు తెలుగులో 76 లక్షల రూపాయలు, కన్నడంలో 40 లక్షల రూపాయలు, తమిళంలో 17 లక్షల రూపాయలు, మలయాళంలో 7 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 1.40 కోట్ల రూపాయలు.. 1.55 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే సీతా పయనం చిత్రం వరల్డ్ వైడ్‌గా 8.7 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ అధికారికంగా ప్రకటించింది.

సీతా పయనం లాభమెంత? నష్టమెంత?
పాటలు, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో సీతా పయనం మూవీకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వీకెండ్‌తో పాటు శివరాత్రి, పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు సాధించింది. కన్నడంలో కంటే తెలుగులోనే ఈ చిత్రానికి మెరుగైన వసూళ్లు వచ్చాయి. ఫీల్‌గుడ్ మూవీ అనిపించుకున్నప్పటికీ వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి సీతా పయనం కలెక్షన్స్ క్రమేణా పడిపోయాయి. సాక్‌నిక్ లెక్క ప్రకారం.. అన్ని భాషల్లోనూ కలిపి రోజుకు 30 లక్షల రూపాయల మార్క్ చేరుకోలేకపోయింది ఈ చిత్రం.

సీతా పయనం బ్రేక్ఈవెన్ కావాలంటే 12.50 కోట్ల రూపాయల షేర్.. 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండగా.. నిర్మాతల అధికారిక ప్రకటనున బట్టి ఈ చిత్రం ఇప్పటి వరకు 8.7 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో 16 కోట్ల రూపాయల గ్రాస్ నష్టం రాగా.. డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా 7 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది ఈ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X