Seetha Payanam Day 1 Collections: సీతా పయనం తొలి రోజు కలెక్షన్స్..అర్జున్ సర్జా మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటీ
యాక్షన్ కింగ్ అర్జున్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు అర్జున్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆయన.. కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. అర్జున్‌లో నటుడే కాదు, నిర్మాత కూడా ఉన్నారు. తాజాగా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను నటి నిలబెట్టేందుకు శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం సీతా పయనం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సీతా పయనం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాలు పరిశీలిస్తే..
సీతా పయనం తారాగణం
సీతా పయనంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఫ్యామిలీకి చెందిన నిరంజన్ హీరోగా నటించారు. అర్జున్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో నటించారు. శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా నిర్మించారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించగా.. జీ బాల మురుగన్ సినిమాటోగ్రఫి, అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

సీతా పయనం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సీతాపయనం సినిమాకు 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మీడియం రేంజ్ సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో అర్జున్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
సీతా పయనం తొలిరోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సీతా పయనంపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక అర్జున్ తన కుమార్తె కోసం భారీగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా సినిమాను మార్కెటింగ్ చేశారు. వరుస ఇంటర్వ్యూలు, మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించారు. దాంతో సీతా పయనంపై బజ్ ఏర్పడింది. బుక్ మై షోలోనూ 15k ఇంట్రెస్ట్ మార్క్స్‌ను సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ డీసెంట్‌గా జరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరులలో వివిధ భాషలలో కలిపి 14వ తేదీ ఉదయం 1000కి పైగా మార్నింగ్ షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ చెబుతోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ ఆధారంగా శనివారం సాయంత్రం ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలిరోజు సీతా పయనం మూవీకి వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











