Seetha Payanam Day 2 Collections: షాకింగ్‌గా సీతా పయనం కలెక్షన్స్.. రెండో రోజు అర్జున్ సర్జా మూవీకి ఎంతంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం సీతా పయనం. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫీల్‌గుడ్ మూవీ అనిపించుకున్న సీతా పయనంకు యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సీతా పయనం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాలు పరిశీలిస్తే..

సీతా పయనం తారాగణం
సీతా పయనంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఫ్యామిలీకి చెందిన నిరంజన్ హీరోగా నటించారు. అర్జున్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో నటించారు. శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా నిర్మించారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించగా.. జీ బాల మురుగన్ సినిమాటోగ్రఫి, అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Seetha Payanam Day 2 Expected Box Office Collections Worldwide Arjun Sarja s film face huge drop

సీతా పయనం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సీతాపయనం సినిమాకు 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

సీతా పయనం తొలిరోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సీతా పయనంపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే అర్జున్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాను జనంలోకి తీసుకెళ్లడానికి బాగానే ఉపయోగపడగా.. ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం దక్కలేదు. సీతా పయనం మూవీకి తొలిరోజున దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ అన్ని అన్ని భాషలు కలిపి కేవలం 33 లక్షల రూపాయల నెట్.. 36 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. కన్నడంలో 11 లక్షల రూపాయలు, తెలుగులో 16 లక్షల రూపాయలు, తమిళంలో 5 లక్షల రూపాయలు, హిందీలో లక్ష రూపాయలు మాత్రమే రాబట్టినట్లు వెల్లడించింది. అర్జున్ సొంత రాష్ట్రం కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం.

సీతా పయనం రెండో రోజు కలెక్షన్స్
ఆదివారం, మహా శివరాత్రి పర్వదినం కావడంతో సీతా పయనం మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ అందుకుంది. తమిళనాడు, కర్ణాటకలోని అర్బన్ ఏరియాలో ఉదయం, మ్యాట్నీ షోలకు మంచి బుకింగ్స్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండో రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ సినిమాకు అన్ని భాషలలో కలిపి 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సీతా పయనం మూవీకి రెండో రోజు ఇండియాలో 38 లక్షల రూపాయలు వసూలైంది. రెండో రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో సీతాపయనం ఏ స్థాయిలో నిలబడగలుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X