Seetha Payanam Day 3 Collections: భారీగా పడిపోయిన సీతా పయనం కలెక్షన్స్.. అర్జున్ సర్జా మూవీకి ఎన్ని కోట్లంటే?
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శక నిర్మాణంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన చిత్రం సీతా పయనం. భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు, అంచనాల మధ్య ఫిబ్రవరి 14న సీతా పయనం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీకెండ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సీతా పయనం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?మూడో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాలు పరిశీలిస్తే..
సీతా పయనం తారాగణం
సీతా పయనంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఫ్యామిలీకి చెందిన నిరంజన్ హీరోగా నటించారు. అర్జున్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో నటించారు. శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా నిర్మించారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించగా.. జీ బాల మురుగన్ సినిమాటోగ్రఫి, అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

సీతా పయనం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సీతాపయనం సినిమాకు 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 500కు పైగా స్క్రీన్‌లలో విడుదల చేశారు.
సీతా పయనం రెండు రోజుల కలెక్షన్స్
సీతా పయనం మూవీకి తొలి రోజున 40 లక్షల రూపాయలు, రెండో రోజున 38 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 66 లక్షల రూపాయల నెట్.. 78 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఈ సినిమాకు కన్నడంలో తొలి రోజున 11 లక్షల రూపాయలు, రెండో రోజున 9 లక్షలు రూపాయలు వసూలైంది. ఇక తెలుగులో మాత్రం కన్నడ కంటే ఎక్కువ రావడం గమనార్హం. తొలి రోజున 16 లక్షల రూపాయలు, రెండో రోజున 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు హిందీలో 10 లక్షల రూపాయలు, మలయాళంలో 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.
సీతా పయనం మూడో రోజు కలెక్షన్స్
ఫీల్ గుడ్ మూవీ అన్న పేరు తెచ్చుకున్నప్పటికీ, అర్జున్ సర్జా కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టినా సీతా పయనం మూవీని జనం ఆదరించడం లేదు. వీకెండ్, శివరాత్రి కలిసి రావడంతో నామమాత్రంగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఏ రోజు కూడా కలెక్షన్స్ కనీసం కోటి రూపాయలు కాదు కదా.. 50 లక్షల రూపాయల మార్క్ కూడా దాటలేకపోయింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో సీతా పయనం మూవీకి బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మూడో రోజు సాయంత్రం 5 గంటల వరకు అర్జున్ సర్జా మూవీకి ఇండియాలో 15 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వసూలు చేసింది. సోమవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం సీతా పయనం మూవీ ఇండియాలో ఇప్పటి వరకు 93 లక్షల రూపాయల నెట్.. 1.10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 1.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందట. ఈ పరిస్ధితుల్లో సీతా పయనం మూవీ భారీ నష్టాలతో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











