Seethamma Vakitlo 4 days Collections: మురారిని బ్రేక్ చేసిన సీతమ్మ చెట్టు.. మహేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్ట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కొత్తగా రిలీజైన సినిమాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇటీవల కాలంలో అగ్ర హీరోలు ప్రభాస్, మహేష్, చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోల హిట్ సినిమాలను పున: విడుదల చేసి భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తుందనే వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తున్నది. అందులో సూపర్ స్టార్ మహేష్ తన చిత్రాలతో హావా కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన బిజినెస్ మ్యాన్, మరారీ, ఒక్కడు సినిమాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో భారీగా కలెక్షన్లు కూడా నమోదు అయ్యాయి.

Seethamma Vakitlo Sirimalle Chettu 4 days Collections Worldwide Mahesh Babu breaks His own Murari Movie Records

అలాగే దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా అప్పట్లో క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఆ సమయంలో భారీ లాభాలను కూడా సంపాదించింది. దాంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి తెలియజెప్పడానికి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ అంశాలతో యాక్షన్, ఎంటర్‌టైనర్‌‌గా రూపొందించిన ఈ సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు. ఈ సినిమాను అప్పట్లోనే సుమారుగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల మేర జరిగింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

Take a Poll

సీతమ్మ వాకిట్లో సిరిమల్లే జట్టు చిత్రం ఓవరాల్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో 15.5 కోట్ల రూపాయల షేర్, ఏపీలో 25 కోట్లకుపైగా షేర్ సాధించింది. ఆంధ్రా, తెలంగాణలో 40.5 కోట్ల రూపాయల షేర్ నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు సాధించింది. దాంతో మొత్తంగా 46 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.25 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 1 కోటి రూపాయలు, 4వ రోజు 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మహేష్ బాబు నటించిన గత రీరిలీజ్ సినిమాల విషయానికి వస్తే.. మురారీ చిత్రం 5.41 కోట్లు, బిజినెస్ మ్యాన్ 5.27 కోట్లు, ఒక్కడు 2 కోట్లు, పోకిరి 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X