Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సీతమ్మ వాకిట్లో...’ వరల్డ్ వైడ్ ఫస్ట్‌వీక్ కలెక్షన్ ఎంత?
హైదరాబాద్ : మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రం..... అంతకంటే ముందు రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్ 'నాయక్' చిత్రం పోటీని తట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. కొన్ని చోట్ల పాత రికార్డులను బద్దలు కొడుతూ...మరికొన్ని చోట్లు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటా సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం తన విశ్వరూపం చూపింది. ఇప్పటి వరకు యూఎస్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం మొదటి స్థానంలో ఉండేది. అయితే పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయానికొస్తే...ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి వారం రూ. 35 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించినట్లు అంచనా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేసిందని, ఓవర్సీస్, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి దాదాపు 10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఏరియాల వారిగా ఎగ్జాక్ట్ డీటేల్స్....త్వరలో విడుదల కానున్నాయి.
వీకెండ్ తో పాటు, సంక్రాంతి హాలిడేస్ కలిసి రావడం, అచ్చమైన తెలుగు సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, హింస, బూతు లేని సినిమా అంటూ మంచి టాక్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ సంఖ్యలో హాజరవుతున్నాయి. అందులోనూ మహేష్ బాబు, వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి సాధారణంగానే అధికం. ఇలా అన్ని విధాలుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందీ చిత్రం.