SVSC Re Release Collections: కింగ్ ఆఫ్ రీ రిలీజెస్‌గా మహేష్ బాబు.. సీతమ్మ వాకిట్లో మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి, సమంత నటించారు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేష్, రోహిణి హట్టంగడి తదితరులు నటించారు. 2013 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ప్రస్తుతం రీ రిలీజ్ రూపంలో మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, గతంలో సాధించిన టోటల్ కలెక్షన్లు, అలాగే ప్రస్తుతం వసూలు చేస్తున్న వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ అంశాలతో యాక్షన్, ఎంటర్‌టైనర్‌‌గా రూపొందించిన ఈ సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు. ఈ సినిమాను అప్పట్లోనే సుమారుగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల మేర జరిగింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Collections Worldwide Mahesh Babu Proves King of Re Releases

సీతమ్మ వాకిట్లో సిరిమల్లే జట్టు చిత్రం ఓవరాల్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో 15.5 కోట్ల రూపాయల షేర్, ఏపీలో 25 కోట్లకుపైగా షేర్ సాధించింది. ఆంధ్రా, తెలంగాణలో 40.5 కోట్ల రూపాయల షేర్ నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు సాధించింది. దాంతో మొత్తంగా 46 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

Take a Poll

ఇక ఓవర్సీస్‌లో కూడా మహేష్ బాబు స్టామినాను మరోసారి రుజువు చేసింది. నార్త్ అమెరికాలో సుమారుగా 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 54 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ మూవీగా ఆ సంవత్సరం నిలిచింది.

Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Collections Worldwide Mahesh Babu Proves King of Re Releases

ఇక టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ కొనసాగుతున్నది. ఈ క్రమంలో దిల్ రాజు ఈ మూవీని మరోసారి రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దాంతో ఈ సినిమా ఊహించని విధంగా ఓపెన్సింగ్స్ సాధించి అభిమానుల్లో జోష్‌ను పెంచింది.

ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 445 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సుమారుగా 50 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా సుమారుగా 50 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ చేసింది. దాంతో
ఈ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 1.25 కోట్ల షేర్ 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రూపాయలు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X