twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల రూ.70కోట్ల బంగ్లా కథ.. అక్కడికి రెగ్యులర్ గా వెళుతుంటాను.. కానీ..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా కాకుండా ఓ విభిన్నమైన మేకింగ్ తో ఆకట్టుకునే అతి కొద్దిమంది దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాలని అనుకుంటారు. సినిమా చాలా నెమ్మదిగా నడుస్తుంది కానీ ఏదో తెలియని ఒక మ్యాజిక్ ని అయితే క్రియేట్ చేస్తారు. అందుకే కమ్ముల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ లవ్ స్టోరీ పైనే ఉంది. అయితే ఆ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శేఖర్ కమ్ముల ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయంపై క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ గా శేఖర్ కమ్ముల ఒక బంగ్లా కు వెళుతూ ఉంటారని టాక్ వచ్చింది. దాని ఖరీదుపై కూడా ఎన్నో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఆ రూమర్స్ పై ఫైనల్ గా కమ్ముల ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    అలాంటి సినిమలు చేస్తే హిట్టే..

    అలాంటి సినిమలు చేస్తే హిట్టే..

    శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేసినా కూడా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఉండే విధంగా తెరకెక్కిస్తారు. ఆయన కథలు మేకింగ్ ఎంతో విభిన్నంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ బలంగా ఉన్నా లేకపోయినా కూడా అందులో ఉండే సన్నివేశాలు ప్రేక్షకుల మనసును చాలా దగ్గరగా ఉంటాయి. వెండితెరపై శేఖర్ కమ్ముల ప్రేమకథలు తీస్తే మాత్రం బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో హిట్ ఇవ్వాల్సిందే. ఫిదా సినిమా తో ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ లవ్ స్టోరీ పైనే ఉంది.

    ఓపెనింగ్స్ గట్టిగానే..

    ఓపెనింగ్స్ గట్టిగానే..

    సాయి పల్లవితో ఫిదా సినిమా అనంతరం రెండవసారి చేస్తున్న లవ్ స్టోరీ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య మొదటి సారి తెలంగాణ అబ్బాయిగా చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. అతనికి నటుడిగానే కాకుండా బాక్సాఫీస్ మార్కెట్ పరంగా కూడా ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందిస్తుందని అర్థమవుతుంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో పలు ఏరియాల్లో మొదటిరోజు హౌజ్ ఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     శేఖర్ కమ్ముల ఆస్తులు..

    శేఖర్ కమ్ముల ఆస్తులు..

    ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల వరుస ఇంటర్వ్యూల తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పర్సనల్ విషయాలతో పాటు భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల ఆస్తులపై అనేక రకాల వార్తలు వచ్చాయి. అమెరికాలో ఉద్యోగం మానేసి సినిమా దర్శకుడు అవ్వాలనే కలతో మళ్ళీ ఇండియాకు వచ్చిన శేఖర్ కమ్ముల ఆస్తులను కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు కొన్ని కామెంట్స్ వచ్చాయి.

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    శేఖర్ కమ్ముల ఆస్తుల విషయాన్ని పక్కన పెడితే అతనికి దగ్గరగా ఉండే వారు మాత్రం అతని సింప్లిసిటీ గురించి చాలా గొప్పగా చెబుతారు. ఆయన మొదటి సినిమానే అప్పులు చేసి నిర్మించారని అందరికి తెలిసిందే. నిజానికి కమ్ముల పర్ఫెక్ట్ సెట్టయ్యింది మాత్రం ఫిదా తరువాతే. ఇక శేఖర్ కమ్ముల 8 నుంచి 10కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

     మొదటి నుంచి అక్కడే..

    మొదటి నుంచి అక్కడే..

    ఇక ఆయన ఎంత పెద్ద దర్శకుడిగా ఎదిగిన కూడ హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లోనే ఉంటారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక స్థాయి వస్తే వెంటనే బంజారాహిల్స్ షిఫ్ట్ అయ్యే వారు చాలామంది ఉంటారు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం ఇంకా తన మిడిల్ క్లాస్ వాతావరణాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారు ఆఫీస్ కూడా తనతో ఇంటి దగ్గర గానే సెట్ చేసుకున్నారు.

     రెగ్యులర్ గా ఆ బంగ్లాకు

    రెగ్యులర్ గా ఆ బంగ్లాకు

    అయితే హైదరాబాద్ బార్డర్ లో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫామ్ హౌజ్ ఉందని గతంలో ఒక టాక్ గట్టిగానే వచ్చింది. 10 ఎకరాలకు పైగా ఉన్న పొలం తో పాటు శేఖర్ కమ్ముల ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కట్టుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ విషయంపై గతంలో శేఖర్ కమ్ముల పెద్దగా స్పందించలేదు . ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం రెగ్యులర్ గా ఆ బంగ్లా దగ్గరకు వెళుతూ ఉంటాడు అని ఒక క్లారిటీ ఇచ్చాడు.

    Recommended Video

    Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
    70కోట్ల ఆస్తి.. నాది కాదు..

    70కోట్ల ఆస్తి.. నాది కాదు..

    దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్న ప్రత్యెకమైన ల్యాండ్ లో ఫామ్ హౌజ్ ను కట్టుకున్నట్లు టాక్ వచ్చింది. దాదాపు దాని ఖరీదు మొత్తం 70 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వచ్చింది. అయితే ఆ ఇంటికి రెగ్యులర్ గా వెళుతున్న మాట నిజమే కానీ అది మాత్రం తనది కాదని శేఖర్ కమ్ముల క్లారిటీ గా వివరణ ఇచ్చారు. ఆ పక్కనే తన ల్యాండ్ ఉండటం వల్ల తరచుగా అక్కడికి వెళుతూ ఉంటాను. ఆ ఇంటి ఓనర్ కూడా నా స్నేహితుడు కావడం వలన సరదాగా వెళ్లి వస్తూ ఉంటాను. అంతేగాని అది నాది కాదని కమ్ముల వివరణ ఇచ్చారు.

    English summary
    Sekhar kammula about costly old model bungalow story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X