అది ఆనంద గోదావరి
శేఖర్ కమ్ముల గోదావరి నిజంగానే ఆహ్లాదకరమైన వేసవిని వెంటబెట్టుకొచ్చింది. ఈ సినిమా క్లాస్‌నే కాక మాస్ ప్రేక్షకులకు కూడా పట్టడం విశేషం. శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాను పొదుపుగా తీయగా గోదావరికి మాత్రం ఆరు కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అంత మొత్తాన్ని ఈ సినిమా రాబట్టగలదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక విచిత్రం సెకండాఫ్ గతి తప్పడంతో ఈ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. దాసరి నారాయణ రావు వంటి సినీ, రాజకీయ దిగ్గజం తీయాల్సిన సినిమా కాదని విమర్శకులు అంటున్నారు. తమిళంలో హిట్ అయిన పందెం కోడి తెలుగులో ఓడిపోయింది. ఇక మహేష్‌బాబు పోకిరి గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీలేదు. ఈ సినిమా అతి పెద్ద విజయం సాధించింది.


Click it and Unblock the Notifications