కమ్ములకు హ్యాపీడేస్-మరి మిగతావారికి?
మహేష్ సినిమా అతిథి, వెంకటేష్ సినిమా తులసి వసూళ్ల పరంగా వెనకపడుతున్నాయి. నాలుగవ వారంలో అతిథి, అయిదవ వారంలో తులసి ఆడుతున్న థియేటర్లలో 50 శాతం మాత్రమే వసూళ్లను రాబట్టుతున్నాయి. ఇక 50 రోజులను పూర్తి చేసుకున్న చిరుత 40 శాతం వసూళ్లతో భారంగా నడుస్తోంది. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ మాత్రం తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. హ్యాపీడేస్ థియేటర్లు కాలేజీ కుర్రాళ్లతో కిటకిటలాడుతున్నాయి. తరుణ్ హీరోగా రూపొందిన నవవసంతం సినిమా తొలి వారం 70 శాతం వసూళ్లతో నెట్టుకొచ్చింది. ఉదయ్ కిరణ్ వియ్యాలవారికయ్యాలు సినిమా రెండోవారం 35 శాతం వసూళ్లతోనే తృప్తి పడాల్సివచ్చింది.


Click it and Unblock the Notifications











