Selfiee day 1 collections సెల్ఫీ మూవీ హిట్టా? ఫట్టా? అక్షయ్ కుమార్ మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన సెల్ఫీ చిత్రం ఫిబ్రవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అక్షయ్ కుమార్‌కు తప్పనిసరిగా హిట్ కావాల్సిన నేపథ్యంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫీ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనే విషయంలోకి వెళితే...

వరుస ఫ్లాపులతో అక్షయ్ కుమార్
బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉన్నా అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నటించిన బెల్ బాటమ్, లక్ష్మీ, అత్రంగీ రే, బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, కట్‌పుత్లీ, రామ్ సేతు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకొన్నారు.

సెల్ఫీ సినిమా కథ ఏమిటంటే?
ఇక సెల్ఫీ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సూపర్ స్టార్ హీరో, నిజాయితీ పరుడైన ఆర్టీవో అధికారికి మధ్య జరిగే అధిపత్య పోరాటమే ఈ సినిమా కథ. అక్షయ్ కుమార్ సినిమా హీరోగా నటిస్తే.. నిజాయితీ పరుడైన ఆర్టీవో అధికారిగా ఇమ్రాన్ హష్మీ నటించారు. అయితే హీరోతో ఫోటో తీసుకోవాలనుకొన్న అధికారి కొడుకుకు చేదు అనుభవం కావడం, దాంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకొంటుంది. హీరో, అధికారి మధ్య గొడవకు పరిష్కారం ఏమిటనేది సినిమా కథ.

సెల్ఫీ సినిమా ఆక్యుపెన్సీ
సెల్ఫీ సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్ మీడియా సానుకూలమైన రివ్యూలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ థియేట్రికల్‌గా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మార్నింగ్ షోలకు 10 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షో 10 శాతం, ఫస్ట్ సెకండ్ షోలకు 10 శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది.

సెల్ఫీ అడ్వాన్స్ బుకింగ్
అయితే సెల్పీ సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయకపోవడంతో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్లలో అనుకొన్నంత అడ్వాన్స్ బుకింగ్ జరుగలేదు. పీవీఆర్‌లో 28 లక్షలు, ఐనాక్స్‌లో 22 లక్షలు, సినిపోలీస్‌లో 13 లక్షలు, ఇతర మల్టీప్లెక్స్‌లో కలిపి దేశవ్యాప్తంగా కొటి రూపాయాల అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది.

సెల్పీ సినిమా కలెక్షన్ల అంచనా
ఇక అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ కలుపుకొని సెల్ఫీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి రోజున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా వారాంతంలో పుంజుకొంటే... బాక్సాఫీస్ వద్ద నిలిబడే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











