Selfiee day 2 collections ఫస్ట్ డే డిజాస్టర్ కలెక్షన్లు.. రెండో రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించిన సెల్ఫీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని రాబట్టడం ట్రేడ్ వర్గాలను షాకింగ్‌కు గురిచేసింది. సెల్పీ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో కలెక్షన్లను కూడా ఎక్కువగా ఊహించారు. అయితే తొలి రోజు కలెక్షన్లు దారుణంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి రోజు కలెక్షన్లు, రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. .

200 కోట్లు వసూలు చేసిన దర్శకుడు
సెల్ఫీ చిత్రం వెనుక బిగ్ బ్యానర్, పాపులర్ దర్శకుడు రాజ్ మెహతా ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచుకొన్నారు. దర్శకుడు రాజ్ మెహతా విషయానికి వస్తే.. గతంలో గుడ్ న్యూజ్ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూలు చేసిన ఘనతను కలిగి ఉన్నాడు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఓపెనింగ్స 6 నుంచి 8 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు.

కరణ్ జోహర్ నిర్మాతగా
సెల్పీ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ లాంటి వెనుక ఉండి నిర్మించాయి. కరణ్ జోహర్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహర్, సుప్రియా మీనన్ లాంటి వాళ్లు నిర్మాతలుగా వ్యవహరించారు. దాంతో ఈ సినిమాపై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడింది.

తొలి రోజు పేలవమైన కలెక్షన్లతో
ఇక అక్షయ్ కుమార్ స్టార్ స్టామినాకు భిన్నంగా తొలి రోజు వసూళ్లను నమోదు చేసింది. ఇండియావైడ్‌గా 3 కోట్లు వసూలు చేస్తే.. ఇండియాలో 2.55 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అలాగే ఓవర్సీస్లో 1.3 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో మొత్తంగా ఈ చిత్రం 4.3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు ఆక్యుపెన్సీ
సెల్ఫీ సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు కంటే రెండో రోజు కొంత ఆక్యుపెన్సీ ఎక్కువగానే కనిపించింది. వారాంతం సెలవు దినం కావడంతో ఫస్ట్ డే కంటే కలెక్షన్లు మెరుగ్గా కనిపించాయి. ఓవరాల్ గా 15 నుంచి 20 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండో రోజు సెల్ఫీ కలెక్షన్ల అంచనా
ఇక సెల్ఫీ చిత్రం రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితం కనిపించేలా ఉంది. రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియా వైడ్ 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్‌లో కలుపుకొని 5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











