Allu Arjun పుష్పకు 2003కోట్లు వచ్చాయని ఉదయభాను కామెంట్ .. ఆడుకుంటున్నారుగా!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా గా తెరపైకి వచ్చిన సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా మిగతా భాషల్లో కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కు సంబంధించిన సక్సెస్ మీట్ లో సీనియర్ యాంకర్ ఉదయభాను చేసిన పొరపాటు కారణంగా సోషల్ మీడియా లో దారుణమైన ట్రోలింగ్స్ వెలువడుతున్నాయి. ఇప్పటికే విమర్శకుల నుంచి సినిమాకు నెగిటివ్ కామెంట్స్ కు భారీగా వస్తున్న తరుణంలో ఇలాంటి పొరపాట్లు ట్రోలర్స్ కు కూడా మరింత అవకాశంగా మారాయి.

భారీ సక్సెస్ అందుకోవాలి అని
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత అంతకుమించి అనే స్థాయిలో సక్సెస్ అందుకోవాలి అని పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తోంది. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు విమర్శలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక పుష్ప సినిమాకు కూడా ట్రోలింగ్స్ చాలానే వచ్చాయి.

నాన్ బాహుబలి రికార్డులు
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. శని ఆదివారాలు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా మిగతా భాషల్లో కూడా సాలిడ్ వసూళ్లను సాదించింది. ఇక ఫస్ట్ వీకెండ్ లోనే 170 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇటీవల సినిమా రెండు వందల కోట్ల పైగా కలెక్షన్స్ అందుకుని చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

గ్రాండ్ గా సక్సెస్ మీట్
అయితే సోమవారం నుంచి కాస్త కలెక్షన్స్ తగ్గుతూ ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు మళ్లీ ప్రమోషన్ డోస్ పెంచే ప్రయత్నం చేశారు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని తిరుపతిలో వేదికను ఏర్పాటు చేసింది. విజయోత్సవ వేడుకలు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా వారి మాటలతో ఆకట్టుకున్నారు.

పొరపాటుగా మాట్లాడడంతో
అయితే సీనియర్ యాంకర్ ఉదయభాను మాత్రం ఎవరూ ఊహించని వేడుకలో పొరపాటుగా మాట్లాడడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప సినిమాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు 200 కోట్లు రావడం నమ్మబుద్ధి కావడం లేదని హెటర్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ రికార్డును చాలా తొందరగా అందుకున్నట్లు ప్రమోట్ చేస్తున్నారు.
Recommended Video

2003కోట్లు అంటూ..
తిరుపతి సక్సెస్ మీట్ లో సినిమా 203 కోట్లు కలెక్షన్ సాధించిందని చెప్పబోయి ఒకేసారి 2003 ఓట్లు రాబట్టినట్లు అని ఉదయభాను గట్టిగా చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ను అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ యాంకర్ గా దర్శనమిచ్చిన ఉదయభాను పై ఈ విధంగా ట్రోలింగ్ జరగడం షాక్ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు గాని ఉదయభాను గాని ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











