Shaakuntalam day 1 Collections శాకుంతలం బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? సమంత తొలి రోజు ఎంత కలెక్ట్ చేసింది?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమా గుణ, దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. శకుంతల, దుష్యంతుడి పురాణకథ, ప్రేమ కథకు దృశ్యరూపం కల్పించారు. విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు భారీగా క్రేజ్ పెంచాయి. దాంతో భారీ ఎత్తున్న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?
భారీ వ్యయంతో శాకుంతలం : శాకుంతలం సినిమాను అత్యాధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ, 3డీ ఫార్మాట్‌లో రూపొందించడం కోసం భారీగా ఖర్చు పెట్టారు. దాదాపు ఈ సినిమాను 40 కోట్ల వ్యయంతో తెరకెక్కించారనే విషయాన్ని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రారంభించిన సమయంలో దిల్ రాజు నిర్మాతగా లేరు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేయడంతో సుమారు 30 కోట్ల షేర్‌ను బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించారు.

శాకుంతలం స్క్రీన్ కౌంట్ : శాకుంతలం సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాల భాషల్లో రూపొందించారు. దాంతో థ్రియేట్రికల్‌గా ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలంగాణ, ఏపీలో దాదాపు 400 కుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 900 నుంచి 1000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు సమాచారం.
తెలుగు, హిందీలో ఆక్యుపెన్సీ : శాకుంతలం సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగులో పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. డల్‌గా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తెలుగులో సుమారు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు సమాచారం. హిందీలో ఆక్యుపెన్సీ దారుణంగా కనిపించింది. ఈ చిత్రానికి ఉత్తరాదిలో 10 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది.

తమిళంలో, మలయాళంలో : ఇక తమిళంలో శాకుంతల ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. 3డీ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. 2డీ వెర్షన్‌కు 25 శాతం, 3డీ వెర్షన్‌కు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మలయాళంలో కూడా ఈ సినిమాకు పెద్దగా స్పందన రాలేదు. ఈ సినిమాకు 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వారాంతంలో ఈ సినిమాపై మౌత్ టాక్ పెరిగితే.. బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది.
అమెరికాలో శాకుంతలం కలెక్షన్లు : ఇక ఓవర్సీస్‌లో శాకుంతలం సినిమాకు ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ప్రీమియర్లను 212 లొకేషన్లలో 446 షోలు ప్రదర్శించగా 50K డాలర్లు అంటే 40 లక్షల రూపాయలు, తొలి రోజు కూడా దాదాపు 51K డాలర్లు అంటే మరో 40 లక్షల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ీ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం ఎంతంటే? : ఇక శాకుంతలం సినిమా ఇండియా వైడ్‌గా ఓ మోస్తారుగానే వసూళ్లను సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే విడుదలకు ముందు ఊహించిన రెస్పాన్స్ ఎక్కడ కనపడటం లేదు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











