Shaakuntalam Collections శాకుంతలంకు భారీ ఓపెనింగ్స్.. సమంత ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలైంది. భారీ బడ్జెట్‌తో దర్శకుడు గుణశేఖర్ 2డీ, 3డీలో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు ప్రదర్శించిన ప్రీమియర్లు, తొలి ఆట నుంచే పూర్తిగా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.
అయితే నెగిటివ్ టాక్‌ను ఎదురించి శాకుంతలం సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే శాకుంతలం సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

శాకుంతలం బడ్జెట్: శాకుంతలం సినిమా దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో భారీగా నిర్మించారు. అయితే తొలుత 2డీలోనే విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను 3డీలో కన్వర్ట్ చేయడం సినిమాకు ప్రతికూలంగా మారింది. త్రీడి కన్వర్షన్‌లో సాంకేతిక లోపాలతో కంటెంట్ భారీగా దెబ్బ తిన్నదనే విషయంపై భారీగా చర్చ జరుగుతున్నది. అయితే 2డీ వెర్షన్ సినిమా చూసిన వారికి మంచి అనుభూతిని కలుగుతున్నదనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.
శాకుంతలం తెలుగు, హిందీ ఆక్యుపెన్సీ: శాకుంతలం సినిమా తొలి రోజు తెలుగు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 33 శాతం, సెకండ్ షోకు 34 శాతం నమోదైంది. తెలుగు 3డీ ఆక్యుపెన్సీ 18 శాతం, మ్యాట్నీ 27 శాతం, ఫస్ట్ 22 శాతం, సెకండ్ షో 24 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. హిందీ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. 7 శాతం, మ్యాట్నీ 7 శాతం, ఫస్ట్ షోకు 6 శాతం, సెకండ్ షోకు 4 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

శాకుంతలం తమిళ, మలయాళంలో: శాకుతలం సినిమా తమిళ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షో 24 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మలయాళంలో మార్నింగ్ షోకు 7 శాతం, మ్యాట్నీ 5 శాతం, ఫస్ట్ షోకు 5 శాతం, సెకండ్ షోకు 9 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు: ఇక శాకుతలం సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 52 లక్షలు, సీడెడ్‌లో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 15 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరు 8 లక్షలు, కృష్ణా 8 లక్షలు, నెల్లూరు 3 లక్షలు రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి షేర్, 15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు: ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో 40 లక్షలు, తమిళంలో 15 లక్షలు, మలయాళంలో 2 లక్షలు, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో కలిపితే 20 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్ 74 లక్షలు వసూలు చేసింది. దాంతో 2.24 కోట్లు షేర్, 4.7 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
శాకుంతలం లాభాల్లోకి రావాలంటే?: శాకుంతలం సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. 18 కోట్లు వాల్యూ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 19 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమా ప్రస్తుతం 2.24 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 16 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











