20 ఏళ్ల తర్వాత 100 కోట్ల క్లబ్‌లో చేరిన షారుక్ ఖాన్ మూవీ
Veer Zaara Collection: ఇటీవల ఏ స్టార్ హీరో మూవీ అయినా 100 కోట్ల మార్క్ కలెక్షన్స్ సాధించడమనేది కామన్ అయిపోయింది. కాస్త పాజివిట్ వచ్చిందంటే చాలు 100 కోట్ల మార్క్ కేవలం రెండు రోజులో లేదా మూడు రోజుల్లో దాటేస్తోంది. కొంత మిక్స్డ్ టాక్ వస్తే పదిరోజుల సమయం పడుతుంది. కానీ, ఓ స్టార్ హీరో సినిమా 100 కోట్ల మార్క్ దాటడానికి ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏండ్ల సమయం పట్టింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ మూవీ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇటీవల సినీ ఇండస్ట్రీల్లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. గతంతో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ వరుసగా రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈ రీ రిలీజ్ మూవీస్ లను కూడా ఫ్యాన్స్ ఎంతో ఆదరిస్తున్నారు. ఈ మూవీస్ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అలా ఇటీవల రీ రిలీజ్ అయిన మూవీ 'వీర్ జరా'. 90లలో వచ్చిన హిట్ చిత్రాలలో 'వీర్ జారా' ఒకటి. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ రీ రిలీజ్ సమయంలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

షారుక్ ఖాన్ వీర్ జారా మూవీ ఈ నెల 13 న 282 థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం.. 'వీర్-జారా' మొదటి రోజు 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు.. 32 లక్షలు, మూడో రోజు 38 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లో సోమవారం రూ.20 లక్షలు, మంగళవారం రూ.18 లక్షలు, బుధవారం రూ.15 లక్షలు, గురువారం రూ.14 లక్షలు వసూలు చేసింది.

ఇలా అత్యంత జనాధారణ పొందిన ఈ మూవీ అప్పట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు రూ. 97 కోట్లు సాధించింది. ఆ తర్వాత ఈ మూవీ పలుమార్లు రీ రిలీజ్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది అంటే.. దాదాపు 20 ఏళ్ల తర్వాత 100 కోట్ల మార్కును అందుకుంది. సినిమా మొత్తం గ్రాస్ రూ.101.75 కోట్ల మార్కును దాటినట్టు తెలుస్తోంది.
ఇక 'వీర్ జరా' సినిమా గురించి చెప్పాలంటే.. ఈ మూవీకి యష్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇది 2004లో మొదటిసారిగా థియేటర్లలో విడుదలైంది. ఇది పాకిస్తాన్‌లో నివసించే స్క్వాడ్రన్ లీడర్ వీర్ (షారుక్ ఖాన్), జారా (ప్రీతి జింటా)ల లవ్ స్టోరీ. వీరిద్దరూ తమ ప్రేమ కోసం జీవితాంతం నిరీక్షిస్తారు. 'వీర్ జరా' ఇరుదేశాల మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ఈ ప్రేమికులు వీడిపోతారు. ఈ మూవీలో రాణి ముఖర్జీ, మనోజ్ బాజ్‌పేయి, కిరణ్ ఖేర్, బొమన్ ఇరానీ, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, దివ్యా దత్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











