Shah Rukh Khan 10 కోట్ల బడ్జెట్.. 100 కోట్లు కొల్లగొట్టిన షారుక్ ఖాన్ మూవీ తెలుసా? రీ రిలీజ్ ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ కాంబినేషన్‌లో కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన చిత్రం కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai). ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం షారుక్ కెరీర్‌లో అత్యంత భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 1998 సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే అన్ని భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది? రీ రిలీజ్ కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే?

కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai) సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 1998 సంవత్సరంలో నిర్మించారు. ఇక ఈ సినిమాను తాజాగా అంటే నేషనల్ సినిమా డే సందర్భంగా అక్టోబర్ 15, 2023 సంవత్సరంలో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఎక్కువగా రిలీజ్ చేయకపోవడంతో కలెక్షన్లు పెద్దగా ప్రభావం చూపలేదు. గత మూడు రోజుల్లో ఈ సినిమా 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు ముంబైలో 25 రూపాయల టికెట్ రేట్ పెట్టడం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Shah Rukh Khans Kuch Kuch Hota Hai Life Time Collections in worldwide

కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai) సినిమా 1998లో రిలీజ్ చేసినప్పుడు.. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టింది. తొలి రోజున 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతం 3 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి వారం పూర్తయ్యే సరికి 6 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.

ఇక కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai) సినిమా తన థియేట్రికల్ రన్‌లో భారీగానే వసూళ్లు సాధించింది. ఇండియాలో ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సుమారుగా 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రీ రిలీజ్ ద్వారా వచ్చిన 15 లక్షల రూపాయలు కలిపితే.. 48.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kuch Kuch Hota Hai life time Collections worldwide

కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai) సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 48.5 కోట్ల రూపాయలు షేర్, 80 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 27 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 107 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai) మూవీ కలెక్షన్లను ఇప్పటి ఇన్ ఫ్లేషన్, టికెట్ ధర‌తో పోల్చుకొంటే.. భారీగానే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాను తాజా టికెట్ ధరతో పొల్చితే.. ఇండియాలో 350 కోట్ల నెట్ కలెక్షన్లు, 500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్టు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X