కింగ్ ఆఫ్ ఓవర్సీస్‌గా ఆ స్టార్ హీరో.. ప్రభాస్, రజనీ, దళపతి విజయ్‌ స్థానం ఎక్కడంటే?

ప్రస్తుతం భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోతున్నాయి. ఒకప్పుడు 100 కోట్లకే నానా కష్టాలు పడిన భారతీయ సినిమా ఇప్పుడు అవలీలగా 1000 కోట్లు కొట్టేస్తోంది. ఏమాత్రం టాక్ బాగున్నా.. జనం ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని కనక వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు ఈ నెంబర్ గేమ్‌లో నువ్వానేనా అన్నట్లుగా ఢీకొట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారతీయ సినిమాకు మనదేశంతో పాటు ఓవర్సీస్ పెద్ద మార్కెట్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడొచ్చే కలెక్షన్స్‌ని బట్టే సినిమా హిట్టా? ఫట్టా అనేది తేల్చేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్‌లో అందరు హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అయితే ఒక్క స్టార్ మాత్రమే ఓవర్సీస్‌ని రూల్ చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఆ హీరో నెలకొల్పిన రికార్డులేంటీ? అనేది పరిశీలిస్తే..

పాన్ ఇండియా కల్చర్‌లో నిర్మాతల పాలిట కామధేనువులా మారింది ఓవర్సీస్ మార్కెట్. భారత్‌లో సరైన కలెక్షన్స్ రాకపోయినా ఓవర్సీస్‌లో సాలీడ్ వసూళ్ల ద్వారా నిర్మాతలు పంట పండించుకుంటున్నారు. ఎన్నో సినిమాలు ఓవర్సీస్ నుంచి మంచి లాభాలను అందుకుని సేఫ్ జోన్‌లోకి వచ్చాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, చైనా, జపాన్ దేశాలలో భారతీయ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ ఏరియాలను కలిపి ఓవర్సీస్‌గా పిలుచుకుంటారు సినీ జనాలు.

Shah Rukh Khan Rules Overseas Box Office No Indian Hero Close to King Khan s Record

ఓవర్సీస్‌లోనూ నార్త్ అమెరికా, గల్ఫ్ దేశాలే భారతీయ సినిమాలకు వెన్నెముకలా నిలుస్తున్నాయని ఎన్నోసార్లు రుజువైంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒక్కో హీరోకి ఒక్క మార్కెట్‌లో పట్టుంది. కానీ ఒక్క హీరో మాత్రం టోటల్‌గా ఓవర్సీస్‌ను శాసిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఓవర్సీస్ అంటే షారుఖ్ సామ్రాజ్యం. తన నటనతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు కింగ్ ఖాన్. అమెరికా, గల్ఫ్ దేశాలలో ఆయన పేరు చెబితే చాలు బాక్సాఫీస్‌లు గడగడలాడాల్సిందే. ఎంతమంది హీరోలు వచ్చినా.. పాన్ ఇండియా సినిమాలు దూసుకొస్తున్నా షారుఖ్ రికార్డ్ మాత్రం ఓవర్సీస్‌లో చెక్కు చెదరలేదు.

ఓవర్సీస్‌లో 10 మిలియన్లు, అంతకంటే ఎక్కువగా కలెక్షన్స్‌ను అత్యధిక సార్లు రాబట్టిన ఏకైక భారతీయ హీరోగా షారుఖ్ ఖాన్‌ చరిత్ర సృష్టించారు. ఆయన ఏకంగా 16 సార్లు ఓవర్సీస్‌లో 10 మిలియన్లు, అంతకంటే ఎక్కువగా వసూళ్లను రాబట్టి భారతదేశానికి వెలుపల కూడా తనకు తిరుగులేదని చాటిచెబుతూ.. కింగ్ ఆఫ్ ఓవర్సీస్ అన్న పేరు తెచ్చుకున్నారు షారుఖ్. ఆయన తర్వాత సల్మాన్ ఖాన్ (9 సినిమాలు), రణ్‌వీర్ సింగ్ (7 సినిమాలు), రజనీకాంత్ (7 సినిమాలు), ఆమీర్‌ఖాన్ (6 సినిమాలు), దళపతి విజయ్ (6 సినిమాలు), ప్రభాస్ (5 సినిమాలు) రణబీర్ కపూర్ (5 సినిమాలు), అక్షయ్ కుమార్ (4 సినిమాలు), హృతిక్ రోషన్ (3 సినిమాలు), అమితాబ్ బచ్చన్ (3 సినిమాలు) ఉన్నాయి.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలో నటిస్తున్నారు. డుంకీ తర్వాత మూడేళ్లుగా షారుఖ్ నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కింగ్ మూవీ కూడా ఖచ్చితంగా ఓవర్సీస్‌లో 10 మిలియన్లకు పైగా రాబడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే ఈ లిస్ట్‌లో పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం నటిస్తున్న కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు ఓవర్సీస్‌లో ఖచ్చితంగా 10 మిలియన్లకు పైగా రాబడతాయని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X