Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లు క్రియేట్ చేసే దిశగా ముందుకెళ్తున్నది.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లు క్రియేట్ చేసే దిశగా ముందుకెళ్తున్నది. బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నది. దీపిక పదుకొన్, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

9 ఏళ్లుగా హిట్ లేని షారుక్

9 ఏళ్లుగా హిట్ లేని షారుక్


సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచించింది. షారుక్ ఖాన్ హిట్ సాధించి 9 ఏళ్లు అవుతున్నది. తప్పనిసరిగా ఆయన నటించిన పఠాన్ సినిమా హిట్ కావాల్సి రావడంతో ఇ చిత్రంపై అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే షారుక్ సినిమాకు రికార్డు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఊహించిన రెస్పాన్స్ లభిస్తున్నది.

5.5 లక్షల టికెట్ల అమ్మకం

5.5 లక్షల టికెట్ల అమ్మకం


పఠాన్ చిత్రం దేశవ్యాప్తంగా 5.5 లక్షల టికెట్లు అమ్మకాలు జరిగాయి. ఇక పీవీఆర్ చైన్ స్క్రీన్లలో 1.08 లక్షలు, ఐనాక్స్‌లో 1 లక్ష, సినీ పోలీస్ మల్టీ ప్లెక్స్‌లో 50 వేలు మేర టికెట్ల అమ్మకాలు జరిగాయి. దాంతో మొత్తంగా 8 లక్షల టికెట్లు అమ్ముడు పోవడం రికార్డుగా మారింది. ఇండియా, ఓవర్సీస్‌లో ఈ చిత్రం కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను అధిగమించింది.

కేజీఎఫ్2ను అధిగమించిన పఠాన్

కేజీఎఫ్2ను అధిగమించిన పఠాన్


అడ్వాన్స్ బుకింగ్ విషయంలో పఠాన్ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. టికెట్ల అమ్మకాలలో రెండో స్థానంలో నిలిచింది. కేజీఎఫ్2 చిత్రం 5.15 లక్షల టికెట్లు అమ్ముడుపోగా, బాహుబలి చిత్రం 6.50 లక్షల టికెట్లు అమ్మకాలు జరిగాయి. ఇప్పటి వరకు బాహుబలి మొదటి స్థానంలో ఉంటే.. పఠాన్ చిత్రం రెండో స్థానంలో నిలిచింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్ల రచ్చ

ఓవర్సీస్‌లో కలెక్షన్ల రచ్చ


షారుక్ ఖాన్‌కు ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, జర్మనీ, యూకే, న్యూజిలాండ్, యూరప్, అమెరికాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ క్రేజ్ తగినట్టుగానే రికార్డు వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు అమెరికా, కెనడాలో $450,000 వసూలు చేసింది. యూఏఈ, జర్మనీలో భారీగా వసూళ్లు సాధించింది. ఆస్ట్రేలియాలో 400,000 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది.

అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 60 కోట్లు

అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 60 కోట్లు


పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 60 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లలో దాదాపు 42 కోట్ల నికర వసూళ్లు ఉన్నాయి. ఈ కలెక్షన్లలో తొలి రోజుకు సంబంధించిన కలెక్షన్లు 22 కోట్లు సాధించడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

తొలి రోజు+ అడ్వాన్స్ బుకింగ్‌తో కలిపి

తొలి రోజు+ అడ్వాన్స్ బుకింగ్‌తో కలిపి


ఇక పఠాన్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా కూడా రికార్డుస్థాయిలో ఉంది. ఈ సినిమా తొలి రోజు సుమారు 50 కోట్ల మేర వసూళ్లను నమోదు చేయవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లు కలుపుకొని 100 కోట్ల మార్కు దాటు అవకాశం ఉంది. తొలి ఆట తర్వాత టాక్ స్ట్రాంగ్‌గా ఉంటే.. ఇంకా కలెక్షన్ల రేంజ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. షారుక్ ఖాన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకు వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X