Pathaan Collections ప్రపంచవ్యాప్తంగా షారుక్ హంగామా.. హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకం.. తొలి రోజు ఎంతంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్దమైంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, పాటలు వివాదాస్పదం కావడంతో భారీగా క్రేజ్ నెలకొన్నది. అయితే మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

వివాదాల మధ్య అడ్వాన్స్ బుకింగ్
షారుక్ ఖాన్‌కు తప్పనసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో పఠాన్ చిత్రం రిలీజ్ అవుతున్నది. అయితే ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ పాట అత్యంత వివాదాస్పదమైంది. దీపిక పదుకోన్ కాషాయ వర్ణపు బికినీ ధరించిందనే విషయం, అలాగే శృంగార భంగిమలు వివాదాస్పదమైంది. దాంతో ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.

వరల్డ్ వైడ్ 200 నగరాల్లో రిలీజ్
పఠాన్ చిత్రాన్ని రికార్డుస్థాయి నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను 200 నగరాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుండటంతో భారీగానే అభిమానుల్లో ఉత్సాహం నెలకొని ఉంది. ప్రపంచంలోనే అత్యంత భారీగా విడుదలవుతున్న ఇండియన్ సూపర్ స్టార్ సినిమా పఠాన్ ఘనతను సాధించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో గ్రాండ్‌గా
భారీ అంచనాలు నెలకొన్న పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అట్టహాసంగా మొదలైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో షారుక్ ఖాన్ బాక్సాఫీస్ సత్తాను చాటుతున్నది. యూఎస్ఏ, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా, భారీ రెస్పాన్స్ లభిస్తున్నది.

హాట్ కేకుల్లా యూఎస్ఏలో టికెట్ల అమ్మకాలు
అమెరికాలో పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రచ్చ మొదలైంది. ఈ చిత్రం తొలి రోజు కోసం రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ మొదలైన ప్రతీ చోట టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. అమెరికాలో ఈ చిత్రం 294 లొకేషన్లలో 977 షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం 300000 అమెరికన్ డాలర్లు అంటే.. 2.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆస్ట్రేలియా, జర్మనీలో
పఠాన్ చిత్రం వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించేందుకు రెడీ అవుతున్నది. యూఏఈలో 3.5K టికెట్లు అమ్ముడుపోవడం ద్వారా 50K డాలర్లను వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో 3K టికెట్లు అమ్ముడుపోగా, 65k డాలర్లు రాబట్టింది. జర్మనీలో 8.5K టికెట్లతో 125K కలెక్షన్లు సాధించింది. పలు దేశాల్లో ఈ సినిమా టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్టు సమాచారం.

పఠాన్ తొలి రోజు కలెక్షన్ల అంచనా
అయితే ప్రస్తుతం పఠాన్‌కు లభిస్తున్న స్పందన చూసి ట్రేడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 60 కోట్ల మేర వసూళ్లను సాధించవచ్చని వెల్లడిస్తున్నారు. ఒకవేళ సినిమా టాక్ పాజిటివ్‌గా ఉంటే.. రెండో రోజు నుంచి మరింత ఊపు అందుకొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. షారుక్ ఖాన్ మూవీకి మాత్రం ప్రస్తుతం భారీగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధిస్తున్నది.


Click it and Unblock the Notifications











