షారుక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్.. దారుణంగా జీరో కలెక్షన్లు.. అయినా 100 కోట్ల క్లబ్‌లో
సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన జీరో చిత్ర వసూళ్లు నిరాశజనకంగా కనిపిస్తున్నాయి. భారీ అంచనాలతో రిలీజైన జీరో చిత్రం షారుక్ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా, అతి చెత్త సినిమాగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గతంలో షారుక్ సినిమా ఫ్లాఫ్ అయినా గట్టిగానే వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు జీరో సినిమాకు వస్తున్న స్పందన చాలా దారుణంగా ఉంది. శుక్ర, శని, ఆది, సోమవారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

వసూళ్లలో భారీ క్షీణత
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, అనుష్మశర్మ, కత్రినాకైఫ్ నటించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. నాలుగో రోజు భారీగా వసూళ్లు క్షీణించినట్టు గణాంకాలు వెల్లడించాయి. వసూళ్లు భారీగా తగ్గడంతో సోమవారం రూ.10 కోట్లకుపైగా వసూలు చేసినట్టు సమాచారం.

దేశీయ కలెక్షన్లు ఇవే
దేశీయ బాక్సాఫీస్ వద్ద శుక్రవారం రూ.20.14 కోట్లు, శనివారం రూ.18.22 కోట్లు, ఆదివారం రూ.20.71 కోట్లు , సోమవారం రూ.10 కోట్లకుపైగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో మొత్తంగా రూ.82 కోట్ల గ్రాస్, నికరంగా రూ.64 కోట్ల నికర వసూళ్లు సాధించినట్టు పేర్కొన్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో
షారుక్ ఖాన్ సినిమాపై క్రేజ్ ఉండటం కారణంగా తొలివారంతంలో ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా వసూళ్లు వచ్చాయి. అమెరికాలో 264 స్క్రీన్లలో ప్రదర్శించగా రూ.35.42 కోట్లు, కెనడాలో 24 స్క్రీన్లలో ప్రదర్శించగా రూ.1.28 కోట్లు, యూకేలో రూ.2.8 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.5.8 కోట్లు, న్యూజిలాండ్‌లో 31 స్క్రీన్లలో రూ.64.07 కోట్లు, మలేషియాలో 6 స్క్రీన్లలో రూ.7.77 కోట్లు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా జీరో సినిమా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.64 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్లో రూ.35 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా షారుక్ చిత్రం తొలివారాంతంలోనే రూ.100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

దారుణంగా షారుక్ సినిమా
అమెరికాలో తొలివారాంతం కలెక్షన్లు చూస్తే ఈ ఏడాది అతిదారుణంగా పరాజయం పాలైన రేస్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర వసూళ్లను దాటలేకపోయింది. జీరో చిత్రం 5 మిలియన్ డాలర్లు వసూలు చేయగా రేస్3 చిత్రం 6.61 మిలియన్లు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ వసూళ్లను కూడా దాటలేకపోయింది.


Click it and Unblock the Notifications











