Dunki 10 Days Collections: మళ్లీ దెబ్బకొట్టిన ప్రభాస్.. డంకీకి ఊహించని వసూళ్లు.. ఇదే జరిగితే ఫ్లాపే!
దాదాపు నలభై ఏళ్లుగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. కొంత కాలం పాటు ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అలాంటిది ఈ ఏడాది వరుస హిట్లతో ఊపులో ఉన్నాడు.
దీంతో ఇప్పుడు షారూక్ ఇటీవలే 'డంకీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి ఆశించినట్లుగా రెస్పాన్స్, కలెక్షన్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో అసలు షారూక్ నటించిన 'డంకీ' మూవీ 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దామా!

యాక్షన్‌కు బ్రేక్ ఇచ్చేశాడు: రెండు యాక్షన్ సినిమాల తర్వాత షారూక్ ఖాన్ నటించిన సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్ ఇచ్చారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

10వ రోజు ఎంత వచ్చింది?: క్రేజీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి రెస్పాన్స్ అంతగా రావట్లేదు. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 210.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు నెట్ రాబట్టింది. ఇక, 10వ రోజు రూ. 9.25 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. అయినా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వంద కోట్ల గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే 10 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 13.6 మిలియన్ డాలర్లు అంటే రూ. 113 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదనే చెప్పుకోవాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 10 రోజుల్లో రూ. 176.47 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 348 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల్లో ఇది రూ. 176 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 34 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
ప్రభాస్ దెబ్బతో తక్కువగా: సీనియర్ పాన్ ఇండియా హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మొదటి వారం రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన రాలేదు. ఇక, రెండో వారంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' నార్త్‌లో బాగా పుంజుకుని భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా షారూక్ ఖాన్ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే ఇది ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











