Dunki 11 Days Collections: షాకిచ్చేలా డంకీ వసూళ్లు.. కోట్లు వచ్చాయి కానీ.. ప్రభాస్ దెబ్బ కొట్టాడుగా!

ఇండియాలోని పలు ఇండస్ట్రీల్లో ఉన్న కొంత మంది సీనియర్ హీరోలు ఇప్పటికి కూడా భారీ విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. గత ఏడాది 'పఠాన్', 'జవాన్' వంటి హిట్లు కొట్టిన ఆయన.. కొద్ది రోజుల క్రితమే 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు.

అయితే, ఈ మూవీకి టాక్‌తో పాటు ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. ఈ నేపథ్యంలో అసలు షారూక్ నటించిన 'డంకీ' మూవీ 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

ఎమోషనల్ స్టోరీతో డంకీ: ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: సీనియర్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

10వ రోజు ఎంత వచ్చింది?: 'డంకీ' మూవీకి ఆశించిన స్పందన రావట్లేదు. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 210.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు నెట్ రాబట్టింది. ఇక, 11వ రోజు రూ. 12.00 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. అయినా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వారం రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే 11 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 14 మిలియన్ డాలర్లు అంటే రూ. 116 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 11 రోజుల్లో రూ. 188.22 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 370 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 11 రోజుల్లో ఇది రూ. 188 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 22 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Shah Rukh Khan Starrer Dunki Movie 11 Days Worldwide Box Office Collections

ప్రభాస్ దెబ్బ లేకుంటేనా: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మొదటి వారం రోజుల్లో మౌత్ టాక్ కారణంగా అనుకున్న రీతిలో స్పందన రాలేదు. ఇక, రెండో వారంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' హిందీలో బాగా పుంజుకుని భారీ స్పందనను అందుకుంటోంది. ఫలితంగా షారూక్ ఖాన్ సినిమాకు వసూళ్లు దారుణంగా డౌన్ అవుతున్నాయి. లేకుంటే ఇది ఎప్పుడో హిట్ స్టేటస్ చేరుకునేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X