Dunki 13 Days Collections: 400 కోట్ల క్లబ్‌లో షారుక్ డంకీ... ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్ వంటి వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిిసందే. మరోవైపు మున్నాభాయ్ సిరీస్, పీకే, సంజు వంటి డిఫరెంట్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాణి.. ఇక వీరి కలయికలో వచ్చిన చిత్రమే డంకీ. ఇక ఈ సినిమా డిసెంబర్ 21న హిందీలో మాత్రమే విడుదలైంది. ఇక ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రాగా.. 13 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పఠాన్, జవాన్ సినిమాలతో హిట్ అందుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ఇటీవల డంకీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటించగా... ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Shah Rukh Khan Starrer Dunki Movie 13 Days Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: షారూక్ ఖాన్ నటించిన ఈ 'డంకీ' సినిమాపై మొదటి భారీ అంచనాలు నెలకొనగా... దీంతో ఈ మూవీ హక్కులకు ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగింది. ఈ ఎమోషనల్ డ్రామా సినిమాకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు మేర బిజినెస్ చేసుకోగా... ఈ సినిమాను దాదాపు 4వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్‌ గా రిలీజ్ అయింది.
Shah Rukh Khan Starrer Dunki Movie 13 Days Worldwide Box Office Collections

13వ రోజు ఎంత వచ్చింది?: సలార్ సినిమా ఎఫెక్ట్ వల్ల 'డంకీ' మూవీ కలెక్షన్స్ దెబ్బ తింటున్నాయి. దీంతో ఫస్ట్ డే రూ. 210.05 కోట్లు, 2వ రోజు రూ. 20.02 కోట్లు, 3వ రోజు రూ. 26.07 కోట్లు, 4వ రోజు రూ. 30.09 కోట్లు, 5వ రోజు రూ. 25.01 కోట్లు, 6వ రోజు రూ. 12.23 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.22 కోట్లు, 8వ రోజు రూ. 8.01 కోట్లు, 9వ రోజు రూ. 7.52 కోట్లు, 10వ రోజు రూ. 9.32 కోట్లు నెట్ రాబట్టింది. ఇక, 11వ రోజు రూ. 12.13 కోట్లు, 12వ రోజు 9.25, 13వ రోజు 8.35 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 13 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: షారుఖ్ ఖాన్ హీరోగా.. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ఈ డంకీ మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. అయినా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 12 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 19 మిలియన్ డాలర్లు అంటే రూ. 158 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే... అనుకున్న స్థాయిలో రావడం లేదని తెలుస్తోంది. కేవలం ఈ సినిమా హిందీలోనే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని 12 రోజుల్లో రూ. 196.97 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 370.25 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 13 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందిన 'డంకీ' చిత్రానికి రూ. 200 కోట్లతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బిజినెస్ రూ. 210 కోట్ల వరకు జరుపుకుంది. ఇక ఈ సినిమా రూ.210 నెట్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 12 రోజుల్లో ఇది రూ. 196.97 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 13.03 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ప్రభాస్ దెబ్బ లేకుంటేనా: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రభాస్ నటించిన సలార్ దెబ్బ పడినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా వల్ల... బాద్ షా సినిమాకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక డంకీ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ కావడం మరో మైనస్. ఇక రెండో వారంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' హిందీలో బాగా పుంజుకుని భారీ స్పందన వస్తోంది. ఫలితంగా షారూక్ ఖాన్ సినిమాకు వసూళ్లు దారుణంగా డౌన్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X