Dunki 2nd Week Collections: మిక్స్‌డ్ టాక్‌తో SRK ర్యాంపేజ్.. 2వారాల్లో డంకీ కలెక్షన్స్ ఎంతంటే?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక గత ఏడాది చివరి నెలలో డిసెంబర్ 21న డంకీ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కాకుండా కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయి.. 14 రోజులు అనగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మరి 14 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్‍ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం డంకీ. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా డిసెంబర్ 21న రిలీజ్ కాగా... అనుకున్న స్థాయిలో ఈ సినిమాకు రెస్పాన్స్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక ఇది కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడం వల్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

రెండు యాక్షన్ సినిమాల తర్వాత షారూక్ ఖాన్ నటించిన ఎమోషనల్ డ్రామా 'డంకీ'కి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించగా... ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ అందించారు.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడగా... మంచి బిజినెస్ జరుపుకుంది. ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

14వ రోజు ఎంత వచ్చింది?: క్రేజీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 210.11 కోట్లు, 2వ రోజు రూ. 20.13 కోట్లు, 3వ రోజు రూ. 26.12 కోట్లు, 4వ రోజు రూ. 30.30 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.36 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.55 కోట్లు, 8వ రోజు రూ. 8.11 కోట్లు, 9వ రోజు రూ. 7.53 కోట్లు నెట్ రాబట్టింది. ఇక, 10వ రోజు రూ. 9.23, 11వ రోజు 11.5 కోట్లు, 12వ రోజు రూ9.05 కోట్లు, 13వ రోజు 3.85 కోట్లు, 14వ రోజు రూ.3.30 నెట్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయినా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే 14 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 19.3 మిలియన్ డాలర్లు అంటే రూ. 160 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 14 రోజుల్లో ఇండియాలో రూ. 203.92 కోట్లు నెట్ వసూలు చేయగా.. ఇండియాలో రూ.240.75 గ్రాస్ రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 400.75 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 14 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ కాగా... అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా... 14 రోజుల్లో ఇది రూ. 240.75 కోట్లు రాబట్టింది. అంటే ఈ సినిమా లాభాల్లో దూసుకుపోతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X