Dunki 15 Days Collections: డంకీకి దారుణమైన వసూళ్లు.. అయినా ప్రభాస్ కంటే ముందే.. షారూక్ కొత్త చరిత్ర

దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత చలన చిత్ర రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. అలాంటిది ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూశాడు.

ఈ పరిస్థితుల్లో గత ఏడాది వరుసగా 'పఠాన్', 'జవాన్' వంటి హిట్లు కొట్టి.. అదే జోష్‌లో 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. అయితే, ఈ మూవీకి టాక్‌తో పాటు ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా తగ్గిపోతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు 'డంకీ' మూవీ 15 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి మరి!

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

డంకీ అంటూ వచ్చిన స్టార్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ఎమోషనల్ మూవీనే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్ ఇచ్చారు.

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

15వ రోజు ఎంత వచ్చింది?: 'డంకీ' మూవీకి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 15.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు, 11వ రోజు రూ. 11.50 కోట్లు, 12వ రోజు రూ. 9.05 కోట్లు, 13వ రోజు రూ. 3.85 కోట్లు, 14వ రోజు రూ. 3.25 కోట్లు, 15వ రోజు రూ. 2.65 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. అయినా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను రాణిస్తూనే ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే 15 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 20.90 మిలియన్ డాలర్లు అంటే రూ. 174 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: షారూక్ ఖాన్ హీరోగా.. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 15 రోజుల్లో రూ. 206.53 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 410 కోట్లు గ్రాస్‌ను రాబ్టటి సత్తా చాటుకుంది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 15 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 రోజుల్లో ఇది రూ. 206 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 4 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తే హిట్ స్టేటస్‌ చేరుతుంది. అదే జరిగితే సలార్ కంటే ముందే హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X