Dunki 16 Days Collections: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో షారూక్.. ఈ విషయంలో ప్రభాస్ కంటే తోపే
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ.. తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్న హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ఈ మధ్యన వరుసగా హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న ఈ బడా హీరో.. ఇటీవలే 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. అయితే, ఈ మూవీకి టాక్ అంతగా రాకపోవడంతో కొద్ది రోజులుగా ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా తగ్గిపోతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు 'డంకీ' మూవీ 16 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే లుక్కేయండి!
డంకీగా షారూక్ వచ్చేశాడు:సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన ఎమోషనల్ సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్:వరుస హిట్లతో దూసుకెళ్తోన్న షారూక్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
16వ రోజు ఎంత వచ్చింది?:'డంకీ' మూవీకి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 16.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు, 11వ రోజు రూ. 11.50 కోట్లు, 12వ రోజు రూ. 9.05 కోట్లు, 13వ రోజు రూ. 3.85 కోట్లు, 14వ రోజు రూ. 3.25 కోట్లు, 15వ రోజు రూ. 2.60 కోట్లు, 16వ రోజు రూ. 2.20 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో:ఇండియాలోనే పేరున్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. అయినా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను రాణిస్తూనే ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే 16 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 20.92 మిలియన్ డాలర్లు అంటే రూ. 174 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే:షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. ఫలితంగా ఈ సినిమా అన్ని ఏరియాలనూ కలుపుకుని 16 రోజుల్లో రూ. 208.67 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 416 కోట్లు గ్రాస్‌ను రాబ్టటి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 16 రోజుల్లో ఇది రూ. 208 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 2 కోట్లు నెట్‌ను రాబడితే హిట్ స్టేటస్ చేరుతుంది. అదే జరిగితే ప్రభాస్ కంటే షారూక్ ఈ విషయంలో తోపు అవుతాడు.


Click it and Unblock the Notifications











