Dunki 17 Days Collections: షారూక్ సంచలన రికార్డ్.. సలార్ కంటే ముందే డంకీ ఫినీష్!
ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తోన్న స్టార్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు.
ఈ జోష్‌తోనే ఇటీవలే 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అయితే, ఈ మూవీకి టాక్ అంతగా రాకపోవడంతో కొద్ది రోజులుగా రెస్పాన్స్ కూడా డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు 'డంకీ' మూవీ 17 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

డంకీగా షారూక్ అరాచకం: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ఎమోషనల్ సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్ ఇచ్చారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

17వ రోజు ఎంత వచ్చింది?: 'డంకీ' మూవీకి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 17.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు, 11వ రోజు రూ. 11.50 కోట్లు, 12వ రోజు రూ. 9.05 కోట్లు, 13వ రోజు రూ. 3.85 కోట్లు, 14వ రోజు రూ. 3.25 కోట్లు, 15వ రోజు రూ. 2.60 కోట్లు, 16వ రోజు రూ. 2.25 కోట్లు, 17వ రోజు రూ. 3.50 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: దిగ్గజ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీతో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా స్పందన రావడం లేదు. అయినా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను అందుకుంటూనే ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే 17 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 21 మిలియన్ డాలర్లు అంటే రూ. 174.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలిసి చేసిన 'డంకీ' మూవీకి మొదటి నుంచీ అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. దీంతో ఈ సినిమా అన్ని ఏరియాలనూ కలిపి 17 రోజుల్లో రూ. 212.22 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 420 కోట్లు గ్రాస్‌ను రాబ్టటి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభాలతో: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 17 రోజుల్లో ఇది రూ. 212 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 2 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

తెలుగులో బాలయ్యలా: షారూక్ ఖాన్ గత ఏడాది వరుసగా 'పఠాన్', 'జవాన్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టాడు. ఈ క్రమంలోనే వచ్చిన 'డంకీ'తో ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు. తద్వారా బాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన స్టార్ హీరోగా నిలిచారు. తెలుగులో బాలయ్య కూడా ఇలానే హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, సలార్ కంటే ముందే టార్గెట్ కొట్టాడు.


Click it and Unblock the Notifications











