Dunki 18 Days Collections: ప్రభాస్‌కు షాకిచ్చిన షారూక్.. ఏకంగా అన్ని కోట్లు.. డంకీకి లాభం ఎంతంటే!
ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న సీనియర్ స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ముఖ్యంగా గత ఏడాదిలోనే అతడు 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో వచ్చి భారీ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులోనే ఏడాది చివర్లో 'డంకీ' అనే డిఫరెంట్ మూవీని చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ ఆశాజనకంగా దక్కడం లేదు. కానీ, ఈ ఆదివారం మాత్రం బాగా పుంజుకుంది. మరి 'డంకీ' మూవీ 18 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి మరి!
డంకీగా షారూక్ ప్రయోగం : స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన ప్రయోగాత్మక సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్ : యమా హిట్లు కొడుతున్న షారూక్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
18వ రోజు ఎంత వచ్చింది : 'డంకీ' మూవీకి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 18.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు, 11వ రోజు రూ. 11.50 కోట్లు, 12వ రోజు రూ. 9.05 కోట్లు, 13వ రోజు రూ. 3.85 కోట్లు, 14వ రోజు రూ. 3.25 కోట్లు, 15వ రోజు రూ. 2.60 కోట్లు, 16వ రోజు రూ. 2.25 కోట్లు, 17వ రోజు రూ. 3.60 కోట్లు, 18వ రోజు రూ. 4.25 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో : ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీతో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా రెస్పాన్స్ లభించడం లేదు. అయినా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలోనే 18 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 21.3 మిలియన్ డాలర్లు అంటే రూ. 176.98 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే : షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో వచ్చిన 'డంకీ' మూవీకి మొదటి నుంచీ అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. దీంతో ఈ సినిమా అన్ని ఏరియాలనూ కలిపి 18 రోజుల్లో రూ. 216.57 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 427 కోట్లు గ్రాస్‌ను రాబ్టటి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభాలతో : ఇండియన్ సూపర్ స్టార్ హీరో షారూక్ 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 18 రోజుల్లో ఇది రూ. 216 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 6 కోట్లు లాభాలను కూడా దక్కించుకుంది.
ప్రభాస్‌కు షారూక్ షాక్ : బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి రెస్పాన్స్ అంతగా రావడం లేదు. కానీ, 18వ రోజైన ఆదివారం మాత్రం ఇది మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ఏకంగా రూ. 4.25 కోట్లు నెట్ రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు కూడా నార్త్‌లో షాక్ ఇచ్చింది. దీంతో 'సలార్: సీజ్‌ఫైర్' కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











