Dunki 1st Week Collections: ఇటు 150 అటు 300 కోట్లు.. షారూక్ సరికొత్త చరిత్ర.. ప్రభాస్ ఎఫెక్ట్ వల్లే!
దాదాపు నలభై ఏళ్లుగా ఇండియన్ సినిమాలో ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. అలాంటిది చాలా కాలం పాటు ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది రెండు హిట్లతో సత్తా చాటాడు.
ఈ ఊపులోనే ఇటీవలే షారూక్ 'డంకీ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అయితే, ఈ చిత్రానికి మాత్రం మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ సరిగా రావట్లేదు. దీంతో కలెక్షన్లు అంతగా దక్కట్లేదు. ఈ నేపథ్యంలో 'డంకీ' మూవీ 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దామా!

షారూక్ మరో కొత్త కాన్సెప్టు: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఆరో రోజు ఎంతొచ్చింది?: షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన మోస్తరుగానే వస్తోంది. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.56 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, 7వ రోజు డౌన్ అవుతూ రూ. 9.75 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: డిఫరెంట్ చిత్రాలతో మెప్పించే రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వస్తోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వంద కోట్ల గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే ఏడు రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 13 మిలియన్ డాలర్లు అంటే రూ. 108 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా స్పందన లభించడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను రాబట్టట్లేదనే చెప్పుకోవాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 7 రోజుల్లో రూ. 151.26 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 301 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 7 రోజుల్లో ఇది రూ. 151 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 59 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుతుంది.
షారూక్ సరికొత్త చరిత్ర: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి వారం రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన రాలేదు. అయినప్పటికీ ఇది రూ. 300 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. ఫలితంగా ఈ మైలురాయిని ఒకే ఏడాది మూడు సార్లు చేరుకున్న హీరోగా షారూక్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇక, ప్రభాస్ 'సలార్' ఎఫెక్ట్ వల్లే ఈ సినిమా పెద్దగా రాణించడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











