Dunki 2 Days Collections: డంకీ మూవీకి దిమ్మతిరిగే వసూళ్లు.. ప్రభాస్ దెబ్బకు షారూక్ మైండ్ బ్లాక్
విలక్షణమైన నటనతో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు.
Recommended Video

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు షారూక్ 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి రెస్పాన్స్ మాత్రం అనుకున్న విధంగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 'డంకీ' మూవీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!

డంకీ అంటూ వచ్చిన హీరో: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలయికలో వచ్చిన చిత్రమే 'డంకీ'. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: సీనియర్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

రెండో రోజు ఎంతొచ్చింది?: బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ జోనర్‌లో రూపొందిన 'డంకీ' మూవీకి మొదటి రోజు అనుకున్న రీతిలో రెస్పాన్ రాలేదు. రెండో రోజు ప్రభాస్ 'సలార్' దెబ్బతో మరింత డౌన్ అయిపోయింది. ఫలితంగా ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు నెట్‌ను వసూలు చేసిన షారూక్ ఖాన్ సినిమా.. రెండో రోజు మాత్రం కేవలం రూ. 20 కోట్లు నెట్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. కానీ, ఓవర్సీస్‌లో ఇది అనుకున్న రీతిలో రాణించడం లేదు. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం 3.2 మిలియన్ డాలర్లు అంటే రూ. 26 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 49.20 కోట్లు నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలాగే, రూ. 76 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది. అదే 'పఠాన్' మూవీ రెండు రోజుల్లో రూ. 70 కోట్లు నెట్, 'జవాన్' రూ. 55 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: విభిన్నమైన కాన్సెప్టుతో సందేశాత్మకంగా రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 రోజుల్లో ఇది రూ. 49 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 161 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











