Dunki 3 Days Collections: ప్రభాస్ కంటే డబుల్.. బాగా పెరిగిన డంకీ కలెక్షన్లు.. మొత్తం అన్ని కోట్లా!
ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఎంతో మంది బడా హీరోలు సత్తా చాటుతోన్నారు. అందులో కొందరు మాత్రమే వరుస హిట్లు హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఈ ఏడాది వరుసగా 'పఠాన్', 'జవాన్' వంటి రెండు భారీ హిట్లను ఖాతాలో వేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే 'డంకీ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మోస్తరు స్పందనే వస్తుంది. కానీ, శనివారం మాత్రం రెస్పాన్స్ బాగా పెరిగింది. మరి 'డంకీ' మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
డంకీతో షారూక్ ప్రయోగం
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్
ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
మూడో రోజు ఎంతొచ్చింది?
సీనియర్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా నటించిన 'డంకీ' మూవీకి మొదటి రోజు అనుకున్న రీతిలో రెస్పాన్ రాలేదు. రెండో రోజు ప్రభాస్ 'సలార్' దెబ్బతో మరింత డౌన్ అయిపోయింది. కానీ, మూడో రోజు కాస్త పుంజుకుంది. ఫలితంగా ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, రెండో రోజు మాత్రం కేవలం రూ. 20.12 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 26 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో
ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. కానీ, ఓవర్సీస్‌లో ఇది అనుకున్న రీతిలో రాణించడం లేదు. దీంతో మూడు రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 5 మిలియన్ డాలర్లు అంటే రూ. 41.58 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలిసి చేసిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని మూడు రోజుల్లో రూ. 75.32 కోట్లు నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలాగే, రూ. 135 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది. అయినప్పటికీ మూడో రోజు మాత్రం ప్రభాస్ సినిమా కంటే డబుల్ నెట్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో సందేశాత్మకంగా రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 రోజుల్లో ఇది రూ. 75 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 135 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుతుంది.


Click it and Unblock the Notifications











