Dunki 3 Weeks Collections: 210 కోట్లు రావాలి.. 3 వారాల్లో వందల కోట్లు.. 1330 కోట్లతో షారూక్ రికార్డు

ఇండియాలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, అందులో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బడా హీరోలు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ ఊపులోనే ఇటీవలే 'డంకీ' అనే ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ అంత గొప్పగా రాలేదు. అయినప్పటికీ ఇది టార్గెట్‌ను పూర్తి చేసి హిట్‌గా నిలిచింది. మరి 'డంకీ' మూవీ 21 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

డంకీతో షారూక్ సరికొత్తగా:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన క్రేజీ మూవీనే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందించాడు.

Shah Rukh Khan Starrer Dunki Movie 3 Weeks Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్:వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

21వ రోజు ఎంత వచ్చింది?:'డంకీ' మూవీకి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 21.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు, 9వ రోజు రూ. 7 కోట్లు, 10వ రోజు రూ. 9 కోట్లు, 11వ రోజు రూ. 11.50 కోట్లు, 12వ రోజు రూ. 9.05 కోట్లు, 13వ రోజు రూ. 3.85 కోట్లు, 14వ రోజు రూ. 3.25 కోట్లు, 15వ రోజు రూ. 2.60 కోట్లు, 16వ రోజు రూ. 2.25 కోట్లు, 17వ రోజు రూ. 3.60 కోట్లు, 18వ రోజు రూ. 4.25 కోట్లు, 19వ రోజు రూ. 1.50 కోట్లు, 20వ రోజు రూ. 1.40 కోట్లు, 21వ రోజు రూ. 1.35 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Dunki Movie 3 Weeks Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో:ఇండియాలోని దిగ్గజ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీతో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ అనుకున్న విధంగా రెస్పాన్స్ లభించడం లేదు. అయినా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలోనే 21 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 21.4 మిలియన్ డాలర్లు అంటే రూ. 177.59 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే:షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలిసి చేసిన 'డంకీ' మూవీకి మొదటి నుంచీ అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. అయినప్పటికీ ఇది టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు డీసెంట్ వసూళ్లతో పర్వాలేదనిపించింది. దీంతో ఈ సినిమా అన్ని ఏరియాలనూ కలిపి 21 రోజుల్లో రూ. 220.72 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 435 కోట్లు గ్రాస్‌ను రాబ్టటి సత్తా చాటుకుంది.

Shah Rukh Khan Starrer Dunki Movie 3 Weeks Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభాలతో:బాలీవుడ్ బాద్‌షా షారూక్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 21 రోజుల్లో ఇది రూ. 220 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 10 కోట్లు లాభాలను కూడా దక్కించుకుంది.

షారూక్ ఖాన్ సెన్సేషన్:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి రెస్పాన్స్ అంతగా రావడం లేదు. అయినప్పటికీ ఇది మూడు వారాల్లో రూ. 220 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఒకే ఏడాదిలో (2023) రూ. 1330 కోట్లు నెట్ వసూలు చేసిన హీరోగా షారూక్ రికార్డు సాధించాడు. అందులో 'జవాన్' రూ. 583.68 కోట్లు, 'పఠాన్' రూ. 525.66 కోట్లు, 'డంకీ' రూ. 220.72 కోట్లు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X