Dunki 5 Days Collections: డంకీకి షాకింగ్ కలెక్షన్లు.. అక్కడ ప్రభాసే తోపు.. మొత్తం ఎన్ని కోట్లంటే!
ఇప్పుడంటే ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితం మాత్రం కొందరు మాత్రమే దేశం మొత్తానికి స్టార్లుగా సత్తా చాటారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఆ మధ్య చాలా ఏళ్ల పాటు హిట్లు కొట్టని ఈ సీనియర్ హీరో.. ఈ ఏడాది వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు.
Recommended Video

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'డంకీ' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆశించిన దానికంటే చాలా తక్కువ స్పందనే లభిస్తోంది. మరి షారూక్ నటించిన 'డంకీ' మూవీ నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

డంకీ అంటూ వచ్చిన స్టార్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఐదో రోజు ఎంతొచ్చింది?: షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన ఆశించిన రీతిలో రావడం లేదు. ఫలితంగా ఈ సినిమాకు ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, రెండో రోజు మాత్రం కేవలం రూ. 20.12 కోట్లు, మూడో రోజు రూ. 26 కోట్లు, నాలుగో రోజు రూ. 30.70 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, ఐదో రోజు డౌన్ అవుతూ రూ. 22.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలిసి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ చేసిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చినా రెస్పాన్స్ మాత్రం మోస్తరుగానే లభిస్తోంది. అలా ఓవర్సీస్‌లోనూ ఇది పెద్దగా రాణించడం లేదు. దీంతో 5 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 9.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 79 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన విధంగా రాణించడం లేదు అనే చెప్పాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 5 రోజుల్లో రూ. 128.13 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 240 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: యాక్షన్ మూవీల తర్వాత షారూక్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 రోజుల్లో ఇది రూ. 128 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 82 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుతుంది.
అక్కడ మాత్రం ప్రభాస్‌దే: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఐదు రోజుల్లో డీసెంట్ వసూళ్లే వచ్చాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 5 మిలియన్ డాలర్లు వసూలు అయ్యాయి. అయితే, అక్కడ 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రానికి మాత్రం నాలుగు రోజుల్లోనే 6 మిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో నార్త్ అమెరికాలో షారూక్ కంటే ప్రభాస్ తోపులా నిలిచాడని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











