Dunki 6 Days Collections: ప్రభాస్ దెబ్బకు డంకీ ఢమాల్.. షారూక్ సినిమాల్లో తొలిసారి.. ఎన్ని కోట్లంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ.. సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు బాద్‌షా షారూక్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన ఆయన.. చాలా ఏళ్ల పాటు పరాజయాలతో సతమతం అయ్యాడు.
Recommended Video

కానీ, ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టి.. ఇప్పుడు 'డంకీ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అయితే, ఈ చిత్రానికి మాత్రం అనుకున్న విధంగా టాక్ రాలేదు. ఈ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 'డంకీ' మూవీ 5 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

షారూక్ కొత్త ప్రయోగంతో: సీనియర్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: వరుస హిట్లతో దూసుకుపోతోన్న షారూక్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.

ఆరో రోజు ఎంతొచ్చింది?: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన ఆశించిన రీతిలో రావడం లేదు. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, 6వ రోజు డౌన్ అవుతూ రూ. 10.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ రూపకల్పనలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చినా రెస్పాన్స్ మాత్రం మోస్తరుగానే లభిస్తోంది. అలా ఓవర్సీస్‌లోనూ ఇది పెద్దగా రాణించట్లేదు. దీంతో 6 రోజుల్లో షారూక్ చిత్రం 12.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 103 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: పాన్ ఇండియా స్టార్ షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన విధంగా రాణించడం లేదు అనే చెప్పాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 6 రోజుల్లో రూ. 140.20 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 266 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ హిట్ల తర్వాత షారూక్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజుల్లో ఇది రూ. 140 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 70 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

ప్రభాస్ దెబ్బకు ఢమాల్: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఆరు రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన రాలేదు. మొదటి ఐదు రోజుల్లో డీసెంట్ వసూళ్లు రాబట్టినా.. ఆరో రోజు మాత్రం ఇది ఢమాల్ అనేసింది. దీనికి కారణం హిందీలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి రెస్పాన్స్ పెరగడమే అని తెలిసింది. దానికి బుకింగ్స్ పెరగడంతో 'డంకీ' డౌన్ అయిందన్న మాట.


Click it and Unblock the Notifications











