Dunki 8 Days Collections: షారూక్‌కు ప్రభాస్ షాక్.. మరీ ఈ రేంజ్‌లోనా.. అన్ని కోట్లు వస్తేనే డంకీ హిట్
ఆరంభం నుంచీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు సాగిపోతోన్నాడు సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న అతడు.. దాదాపు ఐదేళ్ల పాటు విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో 'పఠాన్'తో హిట్ ట్రాక్ ఎక్కి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'డంకీ' అనే సినిమా చేశాడు. దీనికి అనుకున్న విధంగా రెస్పాన్స్ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో షారూక్ నటించిన 'డంకీ' మూవీ 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దామా!
డిఫరెంట్ కాన్సెప్టుతో డంకీ : బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్ : వరుస హిట్లు కొడుతోన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.
ఆరో రోజు ఎంతొచ్చింది : షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి టాక్‌కు అనుగుణంగానే డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, 7వ రోజు రూ. 9 కోట్లు నెట్ మాత్రమే రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో : సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వస్తోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వంద కోట్ల గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే ఏడు రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 13.2 మిలియన్ డాలర్లు అంటే రూ. 109 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే : బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా స్పందన లభించడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదనే చెప్పుకోవాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 8 రోజుల్లో రూ. 161.01 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 318 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : సీనియర్ స్టార్ షారూక్ నటించిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 8 రోజుల్లో ఇది రూ. 161 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 49 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.
ప్రభాస్ ఎఫెక్ట్ చూపడంతో : బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి వారం రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన రాలేదు. ఇక, రెండో వారంలో మాత్రం ఇది ఆశించిన విధంగా స్టార్ట్‌ను అందుకోలేదు. దీనికి కారణం హిందీ బెల్ట్‌లో ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' బాగా పుంజుకుంది. దీంతో అక్కడ ఇప్పుడు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన డంకీతో సమానంగా ఇది రాబడుతోంది.


Click it and Unblock the Notifications











