Dunki 9 Days Collections: షారూక్‌కు ప్రభాస్ షాక్.. దెబ్బేసిన తొలి తెలుగు హీరో.. డంకీ హిట్ కావాలంటే!

భారత సినీ చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. కనీసం ఏడాది ఒక్క హిట్ అయినా సాధించిన అతడు.. చాలా కాలం సక్సెస్ వాసన చూడలేదు.

అలాంటిది ఈ ఏడాది రెండు హిట్లను ఖాతాలో వేసుకుని.. ఇటీవలే 'డంకీ' అనే మూవీతో వచ్చాడు. దీనికి మాత్రం అనుకున్నట్లుగా రెస్పాన్స్, కలెక్షన్లు రావడం లేదనే చెప్పుకోవాలి. మరి షారూక్ నటించిన 'డంకీ' మూవీ 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దామా!

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

ఈ సారి డంకీ అంటూ రాక: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు.

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

9వ రోజు ఎంత వచ్చింది?: షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి రెస్పాన్స్ అంతగా రావట్లేదు. ఫలితంగా దీనికి ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, 2వ రోజు రూ. 20.12 కోట్లు, 3వ రోజు రూ. 26 కోట్లు, 4వ రోజు రూ. 30.70 కోట్లు, 5వ రోజు రూ. 24.32 కోట్లు, 6వ రోజు రూ. 11.56 కోట్లు నెట్, 7వ రోజు రూ. 10.50 కోట్లు, 8వ రోజు రూ. 8.21 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, 9వ రోజు రూ. 7.25 కోట్లు నెట్ మాత్రమే రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఇండియాలోనే పేరు డైరెక్టర్లలో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వస్తోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ వంద కోట్ల గ్రాస్‌ను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే 9 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 13.4 మిలియన్ డాలర్లు అంటే రూ. 111 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: సీనియర్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తీసిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా స్పందన లభించడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదనే చెప్పుకోవాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 9 రోజుల్లో రూ. 167.47 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 330 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9 రోజుల్లో ఇది రూ. 167 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 43 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

 Shah Rukh Khan Starrer Dunki Movie 9 Days Worldwide Box Office Collections

తొలిసారి దాటేసిన ప్రభాస్: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి మొదటి వారం రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన రాలేదు. ఇక, రెండో వారంలో మాత్రం ఇది మరింత డౌన్ అవుతూనే ఉంది. ముఖ్యంగా 9వ రోజు ఈ చిత్రం.. ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' కంటే తక్కువ నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో షారూక్ సినిమాను బీట్ చేసిన ఏకైక తెలుగు హీరోగా రెబెల్ స్టార్ నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X