Dunki Day 1 Collections: షారూక్‌కు బిగ్ షాక్.. తొలి రోజే ఇన్ని కోట్లే.. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కంటే!
బాలీవుడ్‌లో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ఇప్పటికీ ప్రభావాన్ని చూపిస్తూ రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్నారు. అలాంటి వారిలో బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ హీరో.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు షారూక్ 'డంకీ' అనే ఎమోషనల్ మూవీతో పేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం తొలి రోజే షాక్ తగిలింది. మరి 'డంకీ' మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
డంకీ అంటూ షారూక్ రాక : షారూక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన చిత్రమే 'డంకీ'. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందించారు.

షారూక్ మూవీ ప్రీ బిజినెస్ : స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
అలాంటి టాక్‌తో డీసెంట్ : షారూక్ ఖాన్ హీరోగా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ జోనర్‌లో రూపొందిన 'డంకీ' మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 21వ తేదీన విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మోస్తరు స్పందనే వచ్చింది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ అంతగా రావని అంచనాలు వేశారు.

తొలి రోజు నెట్ కలెక్షన్లు : బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి అనుకున్న రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన లభించలేదు. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 30 కోట్లు నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే : 'డంకీ' మూవీకి ఇండియాలో రూ. 40 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, షారూక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక మొదటి రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్లను (20 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే ఫస్ట్ డే రూ. 60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : విభిన్నమైన కాన్సెప్టుతో సందేశాత్మకంగా రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 30 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 180 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.
హిందీలో ఏడో స్థానానికి : షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీ మొదటి రోజు ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా 2023లో హిందీలో ఓపెనింగ్ డేన అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 7వ స్థానానికి చేరింది. అంటే ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీ కంటే ఇది తక్కువ ఓపెనింగ్స్‌ను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











