Jawan 10 Days Collections: షారూక్ మాస్ బ్యాటింగ్.. అప్పుడే అన్ని వందల కోట్లు.. మరో రికార్డుకు చేరవ
నటనకు నటన, డ్యాన్స్‌కు డ్యాన్స్, ఫైట్స్‌కు ఫైట్స్, డైలాగ్స్‌కు డైలాగ్స్, స్టైల్స్‌కు స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. చాలా కాలం పాటు హిట్ కొట్టలేక ఇబ్బంది పడిన అతడు.. 'పఠాన్'తో బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. ఈ ఊపులోనే ఇటీవలే 'జవాన్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచి భారీ వసూళ్లు వస్తున్నాయి. మధ్యలో కాస్త స్లో అయినా రెండో శనివారం దుమ్ముదులిపేసింది. మరి ఆలస్యం లేకుండా 'జవాన్' మూవీ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టను మీరే చూడండి!
జవాన్‌గా మారిపోయిన బాద్‌షా
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా చేసిన మూవీనే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌లో కనిపించింది.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్
అదిరిపోయే కాంబోలో రూపొందిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఏ రోజు ఎంత వచ్చిందంటే?
షారూక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం వారంలో రూ. 368.38 కోట్లు నెట్ రాబట్టింది. అయితే, రెండో వారంలో కాస్త స్లో అవడంతో 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు నెట్ వసూలు అయింది.

10వ రోజు ఎంత వచ్చిందంటే
షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే, రెండో శనివారం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. ఫలితంగా 10వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 31.50 కోట్లు నెట్, రూ. 60 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు
షారూక్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 10 రోజులకు కలిపితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 31 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 257.58 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.
10 రోజులకూ కలిపి ఎంతంటే
క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 10 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 440.48 కోట్లు నెట్‌తో పాటు రూ. 790 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు గ్రాస్ వసూళ్లను అందుకోవడానికి చేరువగా వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
షారూక్ ఖాన్'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది పది రోజుల్లోనే రూ. 440.48 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 140.88 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











