Jawan 15 Days Collections: జవాన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. వందల కోట్లు ఖతం.. టార్గెట్ ప్రభాస్ రికార్డే

ఇండియన్ సినిమాపై అతి తక్కువ మంది హీరోలు మాత్రమే తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఆయన.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. అలాంటిది 'పఠాన్'తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్ ఎక్కి ఇప్పుడు 'జవాన్' సినిమాతో వచ్చాడు. దీనికి మొదటి నుంచీ అదిరిపోయే ఆదరణ లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'జవాన్' మూవీ 15 రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి మరి!

'జవాన్‌'గా షారూక్ ఊచకోత:పాన్ ఇండియా స్టార్ షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌ చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 15 Days Worldwide Box Office Collections

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:హై ఓల్టేజ్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?:అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే, రెండో వారంలో ఈ సినిమా రూ. 128 కోట్లు నెట్‌ను వసూలు చేసుకుంది. ఇలా రెండు వారాల్లోనే ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 517.88 కోట్లు నెట్‌ను రాబట్టింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 15 Days Worldwide Box Office Collections

15వ రోజు ఎంత వచ్చిందంటే:చాలా మంది పాన్ ఇండియా స్టార్లు నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. మధ్యలో కాస్త స్లో అయినా రెండో ఆదివారం మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మళ్లీ వీక్‌ డేస్‌లో క్రమంగా పడిపోతూనే ఉంది. ఫలితంగా 15వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 8.85 కోట్లు నెట్, రూ. 14 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 15 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 15 రోజులకు కలిపి ఇది 39.6 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 327 కోట్లు వరకూ రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో 13 మిలియన్ డాలర్లను రాబట్టి RRR పేరిట ఉన్న 15.33 మిలియన్ డాలర్ల రికార్డును టార్గెట్ చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 15 Days Worldwide Box Office Collections

15 రోజులకూ కలిపి ఎంతంటే:'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 15 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 526.73 కోట్లు నెట్‌తో పాటు రూ. 937 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అందులో రూ. 473 కోట్లు వరకూ హిందీలోనే రాబట్టింది. దీంతో బాహుబలి 2 రికార్డుకు (510.90 కోట్లు) రికార్డుకు చేరువగా వచ్చేస్తుంది.

Shah Rukh Khan Starrer Jawan Movie 15 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 15 రోజుల్లోనే రూ. 526.73 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 226.73 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X