Jawan 16 Days Collections: జవాన్‌కు వీరవిహారం.. వేరే దేశంలో సంచలనం.. మూడో సినిమాగా రికార్డు
విలక్షణమైన నటన, కమర్షియల్ చిత్రాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ప్రపంచ వ్యాప్తంగా అభిమానాన్ని సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే షారూక్ 'జవాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు తడబడుతూ డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 16 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూడండి!
'జవాన్'గా షారూక్ వచ్చాడు : బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. దీపిక పదుకొనే కామియో రోల్ చేసింది.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్ : ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో తీసుకు వచ్చారు.
ఏ రోజు ఎంత వచ్చిందంటే : అట్లీ - షారూక్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే, 2వ వారంలో ఈ సినిమా రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇలా 2 వారాల్లోనే ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 517.88 కోట్లు నెట్‌ను రాబట్టింది. 15వ రోజు రూ. 8.10 కోట్లు వసూలు చేసింది.

16వ రోజు ఎంత వచ్చిందంటే : షారూక్, నయనతార, విజయ్ సేతుపతి నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. రెండో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మళ్లీ వీక్ డేస్‌లో క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా 16వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 7 కోట్లు నెట్, రూ. 10 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు : 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 16 రోజులకు కలిపి ఇది 38 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 315 కోట్లు రాబట్టింది. ఇక, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 4 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. తద్వారా బాహుబలి 2, పఠాన్ తర్వాత ఈ ఘనత అందుకున్న చిత్రంగా నిలిచింది.

16 రోజులకూ కలిపి ఎంతంటే : 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే అందుకుందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 16 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.93 కోట్లు నెట్‌తో పాటు రూ. 947 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అందులో రూ. 480 కోట్లు వరకూ హిందీలోనే రాబట్టింది. దీంతో బాహుబలి 2 రికార్డుకు (510.90 కోట్లు) రికార్డుకు చేరువగా వచ్చేస్తుంది.
టార్గెట్ ఇలా.. లాభం ఎంత : షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 16 రోజుల్లోనే రూ. 532.93 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 232.93 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











