Jawan 17 Days Collections: 2000 కోట్లతో సంచలనం.. చరిత్రలో షారూక్ ఒక్కడే.. ఒకేసారి ఆ రికార్డులు ఔట్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తనదైన రీతిలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చిన ఈ బడా హీరో.. ఇటీవలే 'జవాన్' అనే సినిమాను చేశాడు.
క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షారూక్ నటించిన 'జవాన్' మూవీ 17 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

'జవాన్'గా షారూక్ ఊచకోత: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీనే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?: అట్లీ దర్శకత్వలంో షారూక్ నటించిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇలా 2 వారాల్లోనే ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 517.88 కోట్లు నెట్‌ను రాబట్టింది. 15వ రోజు రూ. 8.10 కోట్లు, 16వ రోజు రూ. 7.61 కోట్లు నెట్ వసూలు చేసింది.
17వ రోజు ఎంత వచ్చిందంటే: షారూక్, నయనతార, విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. రెండో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మళ్లీ వీక్ డేస్‌లో క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా 17వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 12.50 కోట్లు నెట్, రూ. 20 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 17 రోజులకు కలిపి ఇది 40 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 332 కోట్లు రాబట్టింది. తద్వారా రెండు సార్లు (పఠాన్, జవాన్) ఓవర్సీస్‌లో 40 మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్న హీరోగా షారూక్ ఖాన్ అరుదైన రికార్డు సాధించాడు.

17 రోజులకూ కలిపి ఎంతంటే: 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా భారీ రెస్పాన్సే అందుకుందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 17 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 546 కోట్లు నెట్‌తో పాటు రూ. 974 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. పఠాన్ గ్రాస్ రూ. 1050 కోట్లు, జవాన్ గ్రాస్ రూ. 974 కోట్లు కలిపి ఒకే ఏడాది రూ. 2000 కోట్లు గ్రాస్ సాధించిన హీరోగా షారూక్ కొత్త చరిత్రను సృష్టించాడు.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 17 రోజుల్లోనే రూ. 546 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 246 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











