Jawan 2 Days Collections: అటు 200, ఇటు 100 కోట్లు.. జవాన్ పెను సంచలనం.. ఇదేం కుమ్ముడు సామీ!
ఇండియాలో చాలా మంది సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. వారిలో బాద్‌షా షారూక్ ఖాన్ ఒకరు. బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. 'పఠాన్' అనే చిత్రంతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'జవాన్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 2 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

'జవాన్'గా ఎంటరైన షారూక్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన యాక్షన్ సినిమానే 'జవాన్'. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

జవాన్ సినిమా బిజినెస్.. రిలీజ్: స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 10000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

మొదటి రోజు ఎంత వచ్చింది?: అట్లీ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా మొదటి రోజే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.90 కోట్లు నెట్, రూ. 129.6 కోట్లు గ్రాస్ వచ్చింది.
రెండో రోజూ భారీగానే రాబట్టి: షారూక్ ఖాన్ - నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా రెండో రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 53 కోట్లు నెట్, రూ. 85 కోట్లు వరకూ గ్రాస్ వసూలు అయింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ఏకంగా నార్త్ అమెరికాలో మాత్రమే 3 మిలియన్స్ వరకూ సంచలనం సృష్టించింది. అలాగే, వేరే దేశాలను కలిపి 2 రోజుల్లో 5.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 45 కోట్లు వరకూ వసూలు చేసింది.
రెండు రోజులకూ కలిపి ఇలా: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రెండు రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 214.6 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 126.90 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా 100 కోట్లు నెట్, 200 కోట్లు గ్రాస్ మార్కును చేరుకున్న షారూక్ చిత్రంగా ఇది రికార్డులు సాధించింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లో రూ. 126.90 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 173.10 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











