Jawan 2 Weeks Collections: జవాన్ సంచలన వసూళ్లు.. 2 వారాల్లోనే వందల కోట్లు.. RRR రికార్డుకు చేరువగా!

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీల్లో ఇప్పుడు చాలా మందే పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కానీ, గతంలో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. తనదైన చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అతడు.. 'పఠాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'జవాన్' మూవీతో వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ రెండు వారాల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా లుక్కేయండి మరి!

'జవాన్‌'గా వచ్చేసిన షారూక్:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీనే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌ చేసింది. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Shah Rukh Khan Starrer Jawan Movie 2 Weeks Worldwide Box Office Collections

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:పవర్‌ఫుల్ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు

Shah Rukh Khan Starrer Jawan Movie 2 Weeks Worldwide Box Office Collections

ఏ రోజు ఎంత వచ్చిందంటే?:షారూక్ ఖాన్ హీరోగా చేసిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 368.38 కోట్లు నెట్ రాబట్టింది. 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80, 10వ రోజు రూ. 31.80 కోట్లు, 11వ రోజు రూ. 36.85 కోట్లు, 12వ రోజు రూ. 16.25 కోట్లు, 13వ రోజు రూ. 14.40 కోట్లు రాబట్టింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 2 Weeks Worldwide Box Office Collections

14వ రోజు ఎంత వచ్చిందంటే:ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. మధ్యలో కాస్త స్లో అయినా రెండో ఆదివారం మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మళ్లీ వీక్‌ డేస్‌లో డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా 14వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 9 కోట్లు నెట్, రూ. 15 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 2 Weeks Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 14 రోజులకు కలిపి ఇది 39.4 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 325 కోట్లు వరకూ రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్లను రాబట్టి RRR పేరిట ఉన్న 14.33 మిలియన్ డాలర్ల రికార్డుకు చేరువగా వచ్చింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 2 Weeks Worldwide Box Office Collections

14 రోజులకూ కలిపి ఎంతంటే:పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 14 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 518 కోట్లు నెట్‌తో పాటు రూ. 922 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా 'పఠాన్' మూవీ రెండు వారాల కలెక్షన్ల కంటే ఎక్కువ రాబట్టి షారూక్ టాప్ సినిమాగా నిలిచింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 14 రోజుల్లోనే రూ. 518 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 218 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X