Jawan 3 Days Collections: జవాన్‌తో షారూక్ ఊచకోత.. వందల కోట్లు ఔట్.. నెంబర్ వన్ మూవీగా రికార్డు
సుదీర్ఘ కాలంగా భారతీయ సినిమాపై తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న స్టార్ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ ప్రత్యేకతను చాటుకుంటోన్న ఆయన.. 'పఠాన్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
అప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'జవాన్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 3 రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి!

జవాన్‌గా మారిన బాలీవుడ్ స్టార్: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన యాక్షన్ సినిమానే 'జవాన్'. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

జవాన్ సినిమా బిజినెస్.. రిలీజ్: బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

2 రోజుల్లో ఎంత వచ్చిందంటే: కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ రూపకల్పనలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా 2 రోజుల్లోనే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 128.23 కోట్లు నెట్, రూ. 240.47 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడో రోజూ భారీగానే రాబట్టి: షారూక్ ఖాన్ - నయనతార నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా మూడో రోజు ఈ చిత్రానికి హిందీలో రూ. 66 కోట్లు నెట్, తమిళంలో రూ. 3.87 కోట్లు, తెలుగులో రూ. 3.50 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా మూడో రోజు ఇది రూ. 74.50 కోట్లు నెట్, రూ. 110 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: పాన్ ఇండియా స్టార్ షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లోనే 7.25 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక, 3 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా 10 మిలియన్ డాలర్లు అంటే రూ. 83.12 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

మూడు రోజులకూ కలిపి ఇలా: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మూడు రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 351 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 202.73 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా 200 కోట్లు నెట్, 300 కోట్లు గ్రాస్ మార్కును చేరుకున్న హిందీ చిత్రంగా ఇది రికార్డును సాధించింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు రోజుల్లో రూ. 202.73 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 97.27 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











