Jawan 4 Days Collections: 500 కోట్లతో కొత్త చరిత్ర.. ఒక్కరోజే అన్ని కోట్లు.. ఇండియాలోనే తొలి సినిమా
పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు బాద్‌షా షారూక్ ఖాన్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న ఈ బడా హీరో.. చాలా ఫ్లాపుల తర్వాత 'పఠాన్'తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ జోష్‌లోనే షారూక్ ఇటీవలే 'జవాన్' అనే మూవీతో వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. మరి 'జవాన్' మూవీ 4 రోజుల రిపోర్టును చూద్దామా!
జవాన్‌గా వచ్చేసిన షారూక్ ఖాన్:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

జవాన్ సినిమా బిజినెస్.. రిలీజ్:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.
3 రోజుల్లో ఎంత వచ్చిందంటే:కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా 3 రోజుల్లోనే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 206.6 కోట్లు నెట్, రూ. 384 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగో రోజూ భారీగానే రాబట్టి:షారూక్ ఖాన్ - నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 4వ రోజు ఈ చిత్రానికి ఇండియాలోనే ఏ హిందీ సినిమాకూ రాని విధంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా నాలుగో రోజు జవాన్ మూవీ రూ. 81 కోట్లు నెట్, రూ. 140 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ మూడు రోజుల్లోనే 16.96 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక, 4 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా 20 మిలియన్ డాలర్లు అంటే రూ. 160.24 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

నాలుగు రోజులకూ కలిపి ఇలా:'జవాన్' మూవీకి ఓవరాల్‌గా భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నాలుగు రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 287.60 కోట్లు నెట్‌తో పాటు రూ. 525 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా 500 కోట్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. అలాగే, ఒక రోజులో అత్యధిక నెట్ (81 కోట్లు) కలెక్ట్ చేసిన సినిమాగానూ రికార్డు సాధించింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు రోజుల్లో రూ. 287.60 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 12.40 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











