Jawan 5 Days Collections: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న జవాన్.. వర్కింగ్ డేలోనూ దుమ్ములేపే కలెక్షన్స్

బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పఠాన్ సినిమాతో బాలీవుడ్ కు సూపర్ సక్సెస్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో డబుల్ సక్సెస్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్న జవాన్.. 5 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న థియేటర్లకి వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. దీపిక పదుకొనే, సంజయ్ దత్ స్పెషల్ రోల్స్ లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

 Shah Rukh Khan Starrer Jawan Movie 5 Days Worldwide Box Office Collections

షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. పఠాన్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో... ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసుకుంది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది జవాన్ చిత్రం.

4 రోజుల్లో ఎంత వచ్చిందంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలా 4 రోజుల్లోనే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 500కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులు కొల్లగొట్టింది.

 Shah Rukh Khan Starrer Jawan Movie 5 Days Worldwide Box Office Collections

5వ రోజూ భారీగానే... షారూక్ ఖాన్ - నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 5వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ... కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఐదో రోజు జవాన్ మూవీ రూ.30 కోట్ల నెట్ వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ఓవర్సీస్ లో రూ177 కోట్ల వసూలు చేయగా... రూ.316 కోట్ల నెట్ రాబట్టగా.. రూ.343 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.520 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.

 Shah Rukh Khan Starrer Jawan Movie 5 Days Worldwide Box Office Collections

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 160 కోట్లు వసూలు చేసింది. ఇక, 5 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా రూ177 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X