Jawan 6 Days Collections: 600 కోట్లతో సంచలనం.. షారూక్ మరో రికార్డు.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాపై తనదైన మార్కును చూపిస్తూ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. హీరోగా ప్రయాణంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన అతడు.. చాలా ఏళ్ల పాటు పరాజయాలతో సతమతం అయ్యాడు. ఈ పరిస్థితుల్లో 'పఠాన్'తో కమ్‌బ్యాక్ అవడంతో పాటు ఇటీవలే 'జవాన్' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. వీక్‌ డేస్‌లో మాత్రం ఈ మూవీ ఆశించిన రీతిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దామా!

జవాన్‌గా మారిన షారూక్ ఖాన్:షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమానే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

Shah Rukh Khan Starrer Jawan Movie 6 Days Worldwide Box Office Collections

జవాన్ సినిమా బిజినెస్.. రిలీజ్:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఏ రోజు ఎంత వసూలైందంటే:కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందన వస్తూనే ఉంది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమా రూ. 75 కోట్లు నెట్ రాబట్టగా.. రెండో రోజు రూ. 53.23 కోట్లు, మూడో రోజు రూ. 77.83 కోట్లు, నాలుగో రోజు రూ. 80.10 కోట్లు, ఐదో రోజు రూ. 32.92 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది.

Shah Rukh Khan Starrer Jawan Movie 6 Days Worldwide Box Office Collections

ఆరో రోజూ ఎంత వచ్చింది?:షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 6వ రోజు ఈ చిత్రానికి వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 26.50 కోట్లు నెట్, రూ. 35 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 6 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా.. షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 6 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా 25 మిలియన్ డాలర్లు అంటే రూ. 207.29 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 6 Days Worldwide Box Office Collections

ఆరు రోజులకూ కలిపి ఇలా:'జవాన్' మూవీకి ఓవరాల్‌గా అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 6 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 345.80 కోట్లు నెట్‌తో పాటు రూ. 608 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో రూ. 300 కోట్లు నెట్ వసూళ్లను దాటింది. ఫలితంగా బాలీవుడ్‌లో ఈ మార్కును చేరుకున్న 13వ సినిమాగా జవాన్ రికార్డు సాధించింది.

Shah Rukh Khan Starrer Jawan Movie 6 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:క్రేజీ కాంబోలో రూపొందిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజుల్లో రూ. 345.80 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే ఈ సినిమా రూ. 45.80 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X